Kollu Venkateswara Rao: ప్రజా దీవెన, కోదాడ: గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల మూలంగా లక్షలాది ఎకరాలు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు(Kollu Venkateswara Rao) ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ (demnad)చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చెరువులు, కుంటలు అలుగు పోయడం, వరద బీభత్సం వల్ల నాటు పెట్టిన వరి పొలాలు కొట్టుకు పోవడంతో రైతులు తీవ్రoగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి, ప్రత్తి, మిర్చి (Rice, cotton, chillies)తదితర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రెవిన్యూ, వ్యవసాయ అధికారులు వెంటనే గ్రామాలలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వేలాది ఇండ్లు నేలమట్టం అయ్యాయని ఇండ్లు కూలిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తున్నారని, తక్షణమే ప్రభుత్వం వారిని సహాయక కేంద్రాలకు తరలించాలని డిమాండ్ (Demand) చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses)మంజూరు చేయాలన్నారు. అలాగే నిత్యవసర వస్తువులు, వంట సరుకులు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.