–ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులు ఆర్ఎంపీలను ఆశ్రయించడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు
–ఈ సంవత్సరం నుండి సబ్ సెం టర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పేషంట్ల సంఖ్య పెరగాలి
—ప్రభుత్వ వైద్యం అంటే ప్రజల్లో నమ్మకం పోతుంది ప్రజలకు నమ్మ కం కలిగేలా పనిచేయాలి
— వైద్యశాఖ సమీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: విద్యా వైద్యానికి మా మొదటి ప్రాధాన్యత అని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా ఆసుప త్రులలో మెరుగైన వైద్య సేవ అం దేలా చూడాలని మునుగోడు శాసనసభలు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యా లయంలో భువనగిరి ఎంపీ చామ ల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లా ల వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు..
మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 52 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరిచి ప్రజలకు అందుబాటులోకి ప్రజా వైద్యాన్ని తీసుకురావాలన్నారు… వీటిని పట్టిష్టపరచడానికి కావల సిన మౌలిక సదుపాయాలను తాను కల్పిస్తానని ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా డాక్టర్లు వైద్యాధికారులు పనిచేయాల న్నారు. మునుగోడు నియోజకవర్గ వైద్యాన్ని మునుగో డు మోడల్ వైద్యం గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంతా మునుగోడు మోడల్ వైద్యం గురించి చర్చించే లా పనిచేయాల న్నారు.
దీనికిగా ను నా వైపు నుండి నియో జకవర్గ వ్యాప్తంగా ఉన్న 52 ప్రాథ మిక ఆరోగ్య ఉప కేంద్రాలను పట్టి ష్టపరచడంతో పాటు, నారాయణ పూర్ నాంపల్లి మునుగోడు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూ నిటీ ఆరోగ్య కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం, చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుప త్రిగా మార్చడం, మర్రిగూడెం చౌటుప్పల్ లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని పటిష్ట పరిచే విధంగా అన్ని రకాల అనుమ తులు నిధులు తీసుకొస్తామన్నా రు. రాబోయే కాలంలో మును గోడు మోడల్ వైద్యం గురించి చర్చించుకునేలా ప్రతి ఒక్క వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు.
ప్రతి నెలలో ఒకసారి వైద్యం పై సమీక్ష చేస్తానని ప్రజా వైద్యం వైపు ప్రజలు మల్లేలా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ డిఎంహె చ్ఓ పుట్ల మధు, యాదాద్రి డిఎం హెచ్ఓ మనోహర్, నల్గొండ డి సి హెచ్ డాక్టర్ మాతృ, చండూరు డిప్యూటీ డిఎంహెచ్వో కళ్యాణ్ చక్రవర్తి, కమ్యూనిటీ హెల్త్ సెంట ర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు పాల్గొన్నారు.