Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Raj Gopal Reddy: పీహెచ్ సి ప్రజలకు అందుబాటులో ఉండాలి

–ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
–పంచాయతీలు,మున్సిపాలిటీల లో నీరునిల్వ లేకుండా చూడాలి –దోమలు వృద్ధి చెందకుండా స్పెష ల్ డ్రైవ్ చేపట్టాలి
–చండూరు మున్సిపాలిటీలో ప్రభు త్వ భూముల ఆక్రమణలపై చర్య లు తీసుకోవాలి
–ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్రణాళికలు
–చండూరు సమీక్షలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, చండూరు: అభివృద్ధి పనులు, సీజనల్ వ్యాదుల పై చం డూరు ఆర్థివో కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వ హించారు మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy). విద్య వైద్యం పంచాయ తీరాజ్, ధరణి, గ్రామపంచాయ తీలు, మున్సిపాలిటీ, రోడ్లు, విద్యుత్తు అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. చండూరు మండలం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని శాఖల పని తీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాలలో సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలుతున్న సందర్భంగా నీరు నిల్వ ఉండ కుండా తగిన జాగ్రత్తలు చేప ట్టాలని చెట్లు మొలిసిన ఖాళీ ప్లాట్లను వెంటనే తొలగించేలా యజమానులకు నోటీసులు అందించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలలో (Primary Health Sub-Centres, Primary Health Centers in villages) ప్రజ లకు అందుబాటులో ఉండే విధం గా సెంటర్లో ఉండాలని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదే శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యా యుల పైన ఉందని తెలిపారు. గ్రామాలలో మున్సిపాలిటీలలో పాతబడిన డ్రైనేజీలను గుర్తించి వాటిని పునర్ నిర్మించి మురు గునీరు సాఫీగా వెళ్లిపోయేలా చూడాలని ఆదేశించారు.

చండూరు మున్సిపాలిటీలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూము లను, అక్రమ నిర్మాణాలను (Government lands and illegal constructions) గుర్తిం చి వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. వసతిగృహాలల్లో విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటూనే విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి చొరవ తో 197 కోట్లు విద్యుత్ శాఖ కు మంజూరయ్యాయని విద్యుత్ అధికారులు తెలపడంతో ప్రియా రిటి ఆఫ్ లిస్టు ప్రకారం విద్యుత్ పనులు చేయాలని, చండూరులో ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డెడి కేటెడ్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ని (Transformer) పెట్టా లని అధికారులను ఆదేశించారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయి న సందర్భంగా ఆర్డిఓ ఎమ్మార్వో ఎంపీడీవో ఇతర ప్రభుత్వ కార్యా లయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని అధికారులను కోరారు.