–మర్రిగూడెంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం
— మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, మర్రిగూడ: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 70 లక్షల వ్యయంతో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు రోజు రోజుకు కిడ్నీ పేషెంట్లు ఎక్కువవు తున్న నేపథ్యంలో ఈ డయాలసిస్ కేంద్రం కిడ్నీ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యా నించారు. మర్రిగూడ మండల సమీప గ్రామాల కిడ్నీ పేషెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
పేషం ట్ల తాకిడిని బట్టి 24 గంటలు డయాలసిస్ కేంద్రం పనిచేయాలని, వైద్య సిబ్బంది షిప్టుల వారిగా పని చేయాలన్నారు. వైద్యం వృత్తి అనే ది సేవలంటిదని వైద్య సిబ్బంది కమిట్మెంట్తో పని చేయాలని కోరా రు. గ్రామాల వారీగా కిడ్నీ పేషంట్ల జాబితాను తీసుకొని రెగ్యులర్గా వాళ్లకు వైద్య సేవలు అందించా లన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎంహెచ్ ఓ పుట్ట మధు, డి సి హెచ్ డాక్టర్ మాతృ, మర్రిగూడ ప్రభుత్వ ఆసు పత్రి సూపరిండెంట్, ఆస్పత్రి సిబ్బంది స్థానిక మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.