Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy : ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు

–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జి ల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

–ముదిగొండ మండలం ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవoలో పాల్గొ న్న మంత్రి కోమటిరెడ్డి

Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, ముదిగొండ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి వర్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం మంత్రి, ముదిగొండ మండలం ఖానాపూర్ గ్రామంలో ని ర్వహించిన నూతన పథకాల ప్రా రంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృ ణాల్ శ్రేష్ట లతో కలిసి పాల్గొన్నారు.

 

గ్రామంలోని వివిధ పథకాల లబ్ధి దారులతో మంత్రి నేరుగా మాట్లా డుతూ వారికి వచ్చే లబ్ది వివరాల ను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిం చిందని అన్నారు.గతంలో పేద లకు పని కల్పించేందుకు చట్టబద్ధ తను కల్పిస్తూ ఉపాధి హామీ పథ కాన్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిం దని, ఆ నిరుపేద భూమిలేని లబ్ధి దారులకు నేడు ఇందిరమ్మ ఆత్మీ య భరోసా క్రింద 12 వేలు సంవ త్సరానికి సహాయం అందించేందు కు నూతన పథకాన్ని ప్రారంభిస్తు న్నామని అన్నారు. ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 నెలల నుంచి మాత్రమే ప్రజలు కొం తమేర సంతోషంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వం రాగానే 21 వేల కోట్ల రైతుల రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిం డర్, యువత కోసం ప్రభుత్వం ఖాళీల భర్తీ, నైపుణ్యత అందించేం దుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పా టు వంటి అనేక కార్యక్రమాలు అ మలు చేశామని అన్నారు. ఖానా పూర్ వంటి చిన్న గ్రామంలో నూ తనంగా 107 ఇందిరమ్మ ఇండ్లు, 32 నూతన రేషన్ కార్డులు, 144 మంది రైతులకు రైతు భరోసా, 35 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా సరఫరా చేస్తామని అన్నారు. కిరా యి ఇండ్లలో ఉంటున్న పేదల ఇ బ్బందులను తొలగించేందుకు ఇం దిరమ్మ ఇండ్ల పథకం ఉపయోగప డుతుందని, 4 దశలలో 5 లక్షల సహాయం వస్తుందని, ఈ డబ్బును సరిగ్గా వినియోగిస్తూ మంచి ఇండ్లు కట్టుకోవాలని, ఇంటి నిర్మాణంలో అవసరమైన సలహాలు, సూచన లు ప్రభుత్వ అధికారులు, ఇంజనీ ర్లు అందిస్తారని మంత్రి తెలిపారు. గతంలో వైయస్సార్ హాయంలో పూర్తి స్థాయిలో పేదలకు ఇల్లు నిర్మించామని, నేడు అదే తీరులో గ్రామాలలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు.

 

 

రైతు భరోసా నిధులు అందిస్తున్నా మని, రేపటి నుంచి నిధులు బ్యాం కులు పడ్తాయని అన్నారు. భవిష్య త్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరు గుపడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15000 పెట్టు బడి సహాయం అందిస్తామని అ న్నారు. పెండింగ్ రుణమాఫీ సైతం త్వరలో పూర్తి చేస్తామని అన్నారు.పేదలు ఆకలితో ఉండవద్దని చెప్పి సోనియాగాంధీ మార్గదర్శకత్వంలో స్వర్గీయ మన్మోహన్ సింగ్ పార్లమెం ట్లో చట్టం పాస్ చేసి ఉపాధి హామీ కూలి పథకాన్ని ప్రవేశపెట్టారని, నేడు మన ప్రజా ప్రభుత్వం కూ లీలకు సంవత్సరానికి 12 వేలు చొప్పున నేడు మొదటి విడత 6 వేలు పంపిణీ చేశామని అన్నారు.

 

సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ప్రజలకు ఆసరాగా ఉండేందుకు నేడు నాలు గు పథకాలు ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేప డతామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ వ్యవసాయ సాగు యోగ్యమైన భూమి గుర్తించి గ్రామంలో గ్రామ సభ ద్వారా ఆమో దించుకొని 144 మంది రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 35 మంది, 32 నూ తన రేషన్ కార్డుల, 107 మందికి ఇందిరమ్మ ఇండ్లు అర్హులను ప్రాథ మికంగా ఎంపిక చేయడం జరిగింద ని, అర్హులకు పథకాల వర్తింపు నిరంతరాయంగా కొనసాగు తుందని ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డం గుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వ రరావు, జిల్లా పంచాయతీ అధికా రిణి ఆశాలత, మండల ప్రత్యేక అధికారిణి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, ముదిగొండ మండల తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపిడివో శ్రీధర్ స్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.