శ్రీకాంత్ కుటుంబానికి భరోసా ఇచ్చిన మంత్రి
తిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద 20 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిప్పర్తికి చెందిన శ్రీకాంత్ మృతి చెందాడు.
ప్రజా దీవెన నల్గొండ: తిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద 20 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిప్పర్తికి చెందిన శ్రీకాంత్ మృతి చెందాడు. గర్భవతి అయినా అతని భార్య సుమలత ఇటీవల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరి కవల పిల్లలకు జన్మనిచ్చింది. బుధవారం(komati reddy venkat reddy) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకొని సుమలతను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ (Congress) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి,జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
komati reddy venkat reddy help srikanth family