–మౌలిక వసతులు బావుంటేనే సమగ్రాభివృద్ధి
–పెండింగ్ రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలి
–టిమ్స్, నిమ్స్ నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
–ఉన్నతాధికారుల సమీక్షా సమావే శంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:మౌలిక వసతులు బావుంటేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధిస్తుందని రోడ్లు, భవ నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అటవీ అను మతులు లేక పెండింగ్ లో ఉన్న రహదారులపై ప్రత్యేక దృ ష్టి సారించాలని నూతనంగా నియ మితులైన ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ రహ దారుల పనుల్లో వేగం పెంచి ప్రగతి చూపిస్తేనే మరిన్ని నిధులు ప్రభుత్వం నుండి సాధించవచ్చని అధి కారుల కు తేల్చిచెప్పారు.
రహదా రులు, భవనాల శాఖకు ప్రజల తో ప్రత్యేక్ష సంబంధం ఉంటుందని రోడ్లు బాగ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని, అందుకే మీరంత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మం చి పేరు తీసుకురావాలని మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి సూచిం చారు. ఐదుగురు సీఈలకు ఆర్ అండ్ బీ శాఖలోని వివిధ విభాగా లకు బాధ్యులుగా నియమిస్తూ ప్రభు త్వం జీ.ఓ. ఆర్టీ నెంబర్ 40 ని తీసుకువచ్చిన విషయం తెలి సిందే. వీరిలో ఎస్. తిరుమల అడ్మి నిస్ట్రేషన్, టీ జయభారతి సీఈ గా, టీ. రాజేశ్వర్ రెడ్డి రైల్వే సేఫ్టీ వర్క్స్, సిఆర్ఐఎఫ్. జి. చిన్న పుల్లదాసు కి మెంబర్ ఆఫ్ కమీష నరేట్ ఆఫ్ టెండర్స్, డి. శ్యామ్ కుమార్, రూరల్ రోడ్స్, ఎస్సీ ఎస్టీఎఫ్, ఎస్టీ ఎస్టీఎఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఆర్ అండ్ బీ శాఖలో ఐదు గురు సీఈ లకు వారి విభాగాల ను కేటాయిస్తూ జీ.ఓ. విడుదలైన నేప థ్యంలో ఐదుగురు చీఫ్ ఇంజనీర్ల (సీఈ) తో మంత్రి కోమటి రెడ్డి తన నివాసంలో శనివారం సమీక్షా స మావేశం నిర్వహించారు. ఆర్ అం డ్ బీ శాఖలోని ప్రతీ విభాగం రాష్ట్ర అభి వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుం దని మీరంతా కష్టపడి పనిచేసి ప్రజలకు మెరుగైన మౌళిక వసతు ల కల్పనలో చురుకైన పాత్ర పోషిం చాలని ఆయన సీఈలకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేకించి హైదరా బాద్ లోని మూడు టిమ్స్, నిమ్స్, వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో ప్రత్యేక జాగ్ర త్తలు తీసుకోవాలని బిల్డింగ్స్ సీఈ రాజేశ్వర్ రెడ్డికి సూచించారు.
అలాగే ముఖ్యంగా ఆదివాసీ గిరిజ నుల జీవితాలు బాగుపడాలంటే తీవ్ర వాద ప్రభావితప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాల్సి ఉందని, ఇందుకు చర్యలు తీసుకో వాలని సీఈ టీ జయభారతి కి తెలి పారు. రూరల్ రోడ్స్, ఎస్సీ ఎస్టీఎ ఫ్, ఎస్టీ ఎస్టీఎఫ్ నిధులతో నిర్మించే రోడ్లు గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పి స్తాయని ఈ రోడ్లు విషయంలో గత పదేండ్లు నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో వెంటనే సంబంధిత రోడ్ల ను గుర్తించడం, వాటి నిర్మాణానికి కావాల్సిన నిధులపై ప్ర త్యేక దృష్టి పెట్టాలని సీఈ డి. శ్యామ్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.
అంతేకా కుండా అడ్మిన్ సీఈ గా ఎస్. తిరు మల, మెంబర్ ఆఫ్ కమీషనరేట్ ఆఫ్ టెండర్స్ సీఈ జి. చిన్న పుల్లదాసు లు మరింత కష్టపడి పనిచేసి రోడ్లు భవనాల శాఖకు మంచి పేరు తీసుకు రావాలని ఆదేశించారు. అంతేకాకుండా బాధ్యతలు స్వీకరించిన ప్రతీ సీఈ తమకు కేటాయించిన విభాగంలో సంపూర్ణంగా అధ్య యనం చేసి సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు