— దిల్ రాజ్ పదవి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి అలి యాస్ దిల్ రాజున బుధవారం ఉదయం పదవీ భాద్యతలు స్వీక రించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో నేడు ఉదయం వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య పదవీ భాద్యత లు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమానికి హాజరై దిల్ రాజ్ ను అభినందించారు.
తెలంగాణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశ క్తులా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వడంలో దిల్ రాజు సేవలు ఎంతగానో ఉపయోగప డతాయాని ఈ సందర్బంగామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన షూటింగ్స్ తెలంగాణా లో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.