–తలపాకతో స్వయంగా ట్రాక్టర్ తోలుతూ హల్ చల్
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Govt) లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేస్తున్న సంద ర్భంగా రుణమాఫీ సంబరాల్లో భాగంగా గురువారం నల్ల గొండ జి ల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొనేందుకుగాను ఆయన నల్గొండ క్లాక్ టవర్స్ సెంటర్ నుంచి ట్రాక్టర్ పై బయలుదేరారు.
భారీ ఎత్తున ట్రాక్టర్ బైక్ ర్యాలీలో (Tractor Bike Rally) భాగస్వామి అయిన మంత్రి డాక్టర్ పై తలపాగాతో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఆకర్షణగా నిలిచారు. ఈ ర్యాలీలో ఆయన వెంట నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ , నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య , తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, ఇతర నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.