–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఆశా వర్కర్లు వినతి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆశా వర్కర్స్ (Asha Workers)సమస్యలు పరిష్క రించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎ ల్ఏ ఆఫీస్ లో వినతి పత్రాలు ఇవ్వా లని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మాత్యులు కోమ టిరెడ్డి వెంకటరెడ్డికి (Komati Reddy Venkata Reddy)వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు 15 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో (Congress Manifesto) ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఫిబ్రవరి 9న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యేల కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఇవ్వడం జరిగినది.ఆశా వర్కర్స్ గత 19 సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పని భారంతో కాలమెల్లదిస్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయడం లేదని అన్నారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చి కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి ఈఎస్ఐ, పీఎఫ్ (ESI, PF)సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ 50 లక్షలు,పెన్షన్ రూ. 10వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం 5 లక్షలు,పెండింగ్లో రిజిస్టర్ బుక్కులు ,యూనిఫామ్స్, గతంలో పెరిగిన జీతాల ఏరియర్స్, లెప్రసీ పోలియో టీకా, ఎలక్షన్ డ్యూటీ బిల్లులు , ఎగ్జామ్స్ సందర్బంగా పని చేసిన బిల్లులు,తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భీమగాని గణేష్, సలివోజు సైదాచారి, ఆశా కార్యకర్తలు టీ పార్వతమ్మ జీ పూలమ్మ రాజేశ్వరి ధనమ్మ నాగమ్మ ఎల్లమ్మ శైలజ స్రవంతి రేవతి కనకదుర్గ శారద జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.