Komati Reddy Venkata Reddy :ప్రజా దీవెన, నల్లగొండ: రోగుల ప్రాణాలను కాపాడేది డాక్టర్లు మా త్రమే అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శని వారం ఆయన నల్గొండ జిల్లా కలెక్ట ర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో నిర్వహించి న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష సమావేశానికి హాజరయ్యా రు.డాక్టర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుప త్రుల ద్వారా రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని , ప్రత్యేకించి దేవరకొండ ,నాగార్జునసాగర్,మునుగోడు తదితర ఆస్పత్రులతో పాటు, అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
అలాగే ఎక్కడైనా ఖాళీలు ఉంటే అవసరమైతే కాంటాక్ట్ పద్ధతిన భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. వివిధ కారణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగులను ప్రభుత్వ వైద్యులు మాత్రమే కాపాడగలరని అన్నారు. జిల్లాలోని వైద్యులు ఉత్తమమైన సేవలను అందించి ప్రజలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్, డిఆర్డిఏ శేఖర్ రెడ్డి,, తదితరులు హాజరయ్యారు.