Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: నాడు నేడు ఎల్లప్పుడూ జన నాయకుడు కోమటిరెడ్డి

ప్రజా దీవెన, తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో నివాసి సునీత సమస్య ను ప్రస్తావించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను చాటిచెప్పా రు. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ సందర్భంగ సదరు మహిళ సునీత తన 3.5 తులాల బంగారం మంగళసూత్రం చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మండల కాంగ్రెస్ నాయ కులు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దృష్టికి తీసుకు రాగా వెంటనే చర్యలు చేపట్టారు.

అతను నల్గొం డలోని తన క్యాంపు కార్యాలయా నికి సునీతను ఆహ్వానించడం, అప్పటికప్పుడు ఆమెకు కొత్త మం గళ సూత్రం అందించేందుకు చర్య లు చేపట్టడం అన్ని చకచగా జరిగి పోయాయి. ఏది ఏమైనా ఆపత్కా లంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మానవత్వం పట్ల ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలక తీతంగా బాధ్యతతో కూడిన సాను భూతిని ప్రతిబింబిస్తుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.