–ఏడాదిలోపు సీఎం ఆయత చండీ యాగం జరిపిస్తాం
–రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమా టో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన నార్కట్ పల్లి: నల్ల గొండ జిల్లా నార్కెట్ పల్లి మండ లం గోపాలాయ పల్లి శ్రీవారి జాల వేణు గోపాలస్వామి ఆలయంలో సంవ త్సరంలోపు రాష్ట్ర ముఖ్య మంత్రిని తీసుకువచ్చి ఆయత చండీయాగం జరిపిస్తాం- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట రెడ్డి (Komati Reddy Venkata Reddy) వెల్లడి రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజ లు సుఖ సంతోషాలతో, ఆయురా రోగ్యాలతో వర్ధిల్లా లని, ఈ ప్రాంత మంతా పచ్చని పంటలతో, పాడితో కళకళలా డాలని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆకాం క్షించారు. ఆదివారం ఆయన నల్గొం డ జిల్లా నార్కెట్ పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారి జాల వేణు గోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటి రెడ్డి మోహ న్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ సుదర్శన యాగ సహిత రుద్ర యాగం” (Rudra Yagam with Shri Sudarshan Yaga)లో పాల్గొ న్నారు.
వచ్చే మార్చినాటికి బ్రా హ్మణ వెల్లేముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలి పారు. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్ బిసీ సొరం గం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడి 2200 కోట్ల రూపాయల ను మంజూరు చేయిం చడమే కాకుండా, నిద్దుల విడుద లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ,అందరూ బాగున్నప్పుడే దేశం, రాష్ట్రం బాగుంటాయని తెలిపారు .
తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఇందులో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఆగస్టు మొదటి వారంలో లక్షన్నర రూపాయల లోపు రైతులకు రుణమాఫీ (Loan waiver for farmers)వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. 32 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణ మాఫీ చేస్తున్నామని, అన్నదాతలు సుఖంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు .నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇటీవలే డీఎస్సీ పరీక్షలను (DSC Exams) ప్రారంభించడం జరిగిందని తెలిపారు.వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో 2 కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించా రు.చెరువుగట్టుల్లో 100 కాటేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటు న్నామని, అదేవిధంగా వారిగజాల శ్రీ వేణుగోపాలస్వామి గుడి పైకి వచ్చే రహదారిని ఆర్ అండ్ బి శాఖ ద్వారా రెన్యువల్ చేయిస్తానని మంత్రి తెలిపారు.
ప్రజలందరూ కలిసిమెలిసి సుఖసం తోషాలతో ఉండాలని, తాము అన్ని మతాలను గౌరవిస్తా మని అన్నారు. సంవత్స రంలో పు శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ -విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అంగీక రించడం జరిగిందని వచ్చే నెలలో ఈ రహదారి పనులకు టెండర్లు పిలువనున్నట్లు మంత్రి వెల్లడిం చారు.నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వర రావు, డిఎస్పి శివరాంరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.