Komati Reddy Venkata Reddy : ఏఐజి హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు తో సత్కరించడం తెలుగు వారంద రికి గర్వకారణమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసి నంత పరిశోధనలు, ఆవిష్కర ణ లు మరో డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదని వ్యాఖ్యానిం చారు. స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ సరిదిద్దే నాగి స్టెంట్ ఇవ్వాల ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తుందని గుర్తు చేశారు. షుగర్ వ్యాధిగ్రస్తులను సై తం తన పరిశోధనలతో పునర్జన్మ ను ప్రసాదిస్తున్నారని కొనియా డారు. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదని, ప్రపంచంలో నెంబర్ -1 గ్యా స్ట్రో ఎంటరాలజీ డాక్టర్ గా మన తె లంగాణ గడ్డమీద నుంచి సేవలం దించడం మన అదృష్టమని అన్నా రు. ప్రపంచంలో ఏ డాక్టర్ కు సా ధ్యం కానీ విధంగా 5 ఎఎస్ జీఈ (ASGE) (అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ) క్రిస్టల్ అవార్డులు పొందిన ఏకైక ఎండోస్కోపిస్ట్ మన నాగేశ్వర్ రెడ్డి అని తెలిపారు. అమెరికన్ డాక్టర్ల కు సైతం ఇది సాధ్యం కాలేదంటే వారి ప్రతిభను మనం అర్ధం చేసు కోవచ్చని చెప్పారు. ప్రపంచవ్యా ప్తంగా ఉన్న పేరొందిన జర్నల్స్ లో 1085 పరిశోధన పత్రాలను ప్రచు రించారని అన్నారు. గ్యాస్ట్రో ఎం టరాలజీలో విద్యనభ్యసించే వారి కోసం ముద్రించిన 50కి పైగా గ్యా స్ట్రోఇంటెస్టైనల్ (GI) పాఠ్య పుస్తకాల ముద్రణకు తన విజ్ఞానా న్ని ధారబోసారని వివరించారు.
ఏ ప్రభుత్వం ఉన్నప్పటికి నాగేశ్వర్ రెడ్డి కృషిని గుర్తిస్తూ రావడం చాలా సంతోషకరణమని అన్నారు. గతం లో వారు 2002లో పద్మశ్రీ అవార్డు, 2016లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారని, ప్రస్తుతం 2025 పద్మవిభూషన్ అవార్డును అందు కున్నారని పేర్కొన్నారు. వారికి పద్మభూషణ్ అవార్డు రావడం నిజంగా తెలుగువారందరికి గర్వ కారణమన్నారు. వారు రాబోయే రోజుల్లో భారతరత్న, నోబెల్ బహు మతి అందుకునే స్థాయికి చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, అమెరికాలో అందించే ప్రతిష్టాత్మ కమైన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎం డోస్కోపీ రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డు పొందిన ఇద్దరు విదేశీయుల్లో నాగే శ్వర్ రెడ్డి ఒకరని కితాబిచ్చారు. వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును అందుకున్న డాక్టరు, నోబెల్ బహు మతికి అన్ని విధాల అర్హులని నేను భావిస్తున్నానని తెలిపారు.హెలికో బాక్టర్ పైలోరి బ్యాక్టీరియా, గ్యాస్ట్రి టిస్ మరియు పెప్టిక్ అల్సర్ కు కారణమవుతుందని కనుగొన్నందు కు బారీ మార్షల్ మరియు రాబిన్ వారెన్ లకు 2005 లో నోబెల్ బహుమతి వచ్చిందని గుర్తు చేస్తూ .
అలాగే, గ్యాస్ట్రిక్ జ్యూస్ లు (జీర్ణ రసం) ఎలా స్రవిస్తాయి అనే విష యం కనుగొన్నందుకు ఇవాన్ పెట్రో విచ్ పావ్లోవ్‌కు 1904లో నోబెల్ బహుమతి రావడం జరిగింద న్నారు. మరి, నాగి స్టెంట్ తో పాటు అనేక ఆవిష్కరణలు చేసిన డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి నోబెల్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి మంత్రి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
Minister Komatireddy venkatreddy with doctor nagheswarreddy pic.twitter.com/paJEViNBf0
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 3, 2025