Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: రూ. 190 కోట్లతో చటాన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి

–చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి తో పాటు త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం
–15 రోజుల్లో పనుల ప్రారంభానికీ శ్రీకారం చుడతాo
–రూ. 5వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కృషి
–రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, రంగారెడ్డి: రూ. 190 కోట్లతో చటాన్ పల్లి ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణం (Construction of ROB Bridge)పనులు 15 రోజుల్లో ప్రా రంభం చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అన్నారు. రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 44వ జాతీయ రహదా రి వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శం కర్ స్వాగతం పలికారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడి యాతో మాట్లాడుతూ రూ. 190 కోట్ల రూపాయలతో చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టడానికి ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. గ తంలో రూ. 90 కోట్లతో నిర్మాణ వ్యయం చేసేందుకు సిద్ధం చేశారని కానీ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో భవిష్యత్తు తరాలను దృ ష్టిలో పెట్టుకొని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రు. 190 కోట్లను మం జూరు చేసి మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పనులు చేపడు తామని వైద్య జంక్షన్ తరహాలో రైల్వే ఓట్ బ్రిడ్జి నిర్మాణం చేపడ తామని తెలిపారు.

అదేవిధంగా హైదరాబాద్ నుండి కర్నూల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే (Greenfield Highway)కోసం ఐదు వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొం దించబడ్డాయని సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్గరితో (Nitin Gadgari)రాష్ట్ర ప్రభు త్వం తరఫున మాట్లాడానని తెలిపారు. ఈ రోడ్డు రావడంతో రవాణా మార్గం మరింత సౌకర్య వంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకా రంతో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృ ద్ధి కార్యక్రమాలను రూపొందిస్తా మని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు మొదలు పెట్టారనీ మంత్రులు కూ డా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిం చడం జరుగుతుందని పేర్కొన్నా రు. డీఎస్సీ ఉద్యోగాలు కూడా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఇస్తారని టిఆర్ఎస్ నాయకుల (TRS leaders)మాటలు నమ్మితే ఏమి ప్రయో జనం లేదని తెలిపారు. గత పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయా పన చేసింది వాళ్లేనని వాళ్ల మాట లు నమ్మకూడదని హితవు పలి కారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మా ట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం గొప్ప విషయ మని కృతజ్ఞతలు తెలిపారు. త్వర లోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మా ణాన్ని కూడా శంకుస్థాపనను చేప డతామని తెలిపారు. నియోజకవ ర్గాన్ని సర్వతో ముఖాభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నందుకు ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి, ఇతర శాఖల మం త్రులకు ఆయన కృతజ్ఞతలు తెలి పారు.