–ఆగస్టు చివరి నాటికి నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పూర్తి
–రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం
–రాష్ట్ర రోడ్లు,భవనాలు సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ నూతన ప్రభుత్వ వైద్య కళాశాల (Govt Medical College)భవనాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) తెలిపా రు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల (Govt Medical College) పనులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.అనంతరం మీడి యా ప్రతినిధులతో మంత్రి మాట్లా డుతూ ఆగస్టు చివరి నాటికి పను లను పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాలను విద్యార్థులకు అందు బాటులోకి తీసుకురానట్లు తెలిపా రు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో (In the main government hospital) నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యా ర్థులు, ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల నుండి వైద్య కళాశాల పనులను వేగవంతం చేశామని చెప్పారు.
ఉస్మానియా, గాంధీ, కాకతీయ (Osmania, Gandhi, Kakatiya) తర్వాత ఎక్కువ మంది రోగులు వస్తున్నది నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికే నని తెలిపారు. ఈ వైద్య కళాశాల పూర్తయితే విద్యార్థులకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకే 95% పనులు పూర్తయ్యాయని, బాలికల వసతిగృహం సెప్టెంబర్ లో పూర్తవు తుందని, పనులలో నాణ్యత ఉం డాలని ఆయన ఇంజనీరింగ్ అధి కారులు ,కాంట్రా క్టర్ ను ఆదేశిం చారు. రాష్ట్రంలోనే నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను ఉత్తమ వైద్య కళాశాలగా, మోడల్ వైద్య కళాశాలగా (As a medical college, as a model medical college) తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వైద్యం కోసం పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూస్తున్నారని,ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అప్పలపాలవుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్యశ్రీ (Arogyashri)సైతం అమలు చేస్తామని, అన్ని వసతులు కల్పిస్తామని, ముఖ్యంగా సిబ్బందికి ట్రాన్స్పోర్ట్ కోసం రెండు ఏసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తాగునీరు, సివిల్ పనులు, విద్యుత్తు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలకు 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, నర్సింగ్ కళాశాలను సైతం ఇదే క్యాంపస్ లో నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడిం చారు.జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సి పల్ తదితరులు ఉన్నారు.