–ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సర్వం సిద్ధంగా ఉన్నాం
–విద్యా, వైద్యం కోసం ప్రతీక ఫౌం డేషన్ ద్వారా సాయం
–రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అన్ని విధాల అందుకునేందుకు వ్య క్తిగతంగా తాము సర్వం సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నల్ల గొండ జిల్లా కేంద్రంలో త్వరలోనే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని,త్వరలోనే ఆ కళ సాకారం చేస్తామని స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బహుమతుల ప్రదా నోత్సవంతో పాటు జిల్లా కేంద్రం లోని జర్నలిస్టులకు స్థానిక ఐకాన్ ఆసుపత్రి సౌజన్యంతో రాయితీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో విజయవంతంగా నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అ తిథిగా హాజరై బహుమతులు, హె ల్త్ కార్డులు పంపిణీ చేసి ప్రెస్ క్లబ్ బాధ్యులను, ఐకాన్ ఆసుపత్రి యా జమాన్యంను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50 శాంతం రాయితో కూడిన ఉచిత వైద్య సేవలను అందించడం అభి నందనీయమన్నారు. నల్లగొండ పట్టణంలో అర్హత కలిగిన జర్నలి స్టులకు గతంలో దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలోనే స్థలం కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అనివా ర్యంగా కాని సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు పట్టాల పంపిణీ ఆలస్యం జరుగుతుందన్నారు.
జిల్లా కేంద్రం లో ఇప్పటికే పట్టణంలో పేదలoద రికీ సొంతిoటి కళ సాకారం చేసే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ క్రమంలోనే అర్హత కలిగిన విలేకరు లందరికి కూడా అందులో అవ కాశం కల్పిస్తామన్నారు. ప్రతి ఫౌం డేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరు గుతుంన్నారు. ఐఐటి, ఎంబిబిఎస్ వంటి వాటిల్లో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు పూర్తి సహాయ సహ కారాలు అందించడం జరుగు తుం దన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రతిభ కనబర్చిన వారికి ప్రతి ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నా రు. నల్లగొండ పట్టణాభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్ నిర్మా ణంతోపాటు కోట్ల రూపాయల వ్యయంతో అనేక కా ర్యక్రమాలు చేపడం జరిగిందన్నా రు.
జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఎల్ల వేళలా కృషి చేయడం జరుగుతుం దన్నారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్న లిస్టులు కోటగిరి దైవాదినం, ఏచూ రి భాస్కర్, పహిముద్దీన్, గుండగో ని జయశంకర్ గౌడ్, దీకొండ రవి శంకర్, అశోక్ రెడ్డి, రాము గౌడ్, వీరస్వామి, అంజయ్య, నరసింహ గౌడ్, శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాదె రమేష్, కోశాధికారి దండంపల్లి రవికు మార్, ఐకాన్ ఆసుపత్రి యజ మాన్యం డాక్టర్లు కోడే శశాంక్, డాక్టర్ రవిశంకర్ కన్నా, మహిళా ప్రతినిధి మేకల వరుణమ్మ, నల్లగొండ జిల్లా ఎల క్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్య దర్శులు వెంకటరెడ్డి, సల్వాది జాన య్య, వెంకట్ రెడ్డి, వీడియో జర్నలి స్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు అల్లి మల్లేశ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సలీం, భూపతి రాజు, మ క్సూద్, మధు వెంకట మధు నీలం, ముచ్చర్ల విజయ్, సలీం, కత్తుల యశ్వంత్, సివిఆర్ మధు, కత్తుల హరి, రామకృష్ణ, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.