–రాబోయే ఐదేండ్లలో 35 లక్షల ఎకరాలకు ప్రణాళిక
–పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం
–ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండిం గ్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల స్కీంలు పూర్తి చేస్తాం
— ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ మార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్రం లోని ప్రజా ప్రభుత్వం హయాం ఐదేండ్లలో రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పేర్కొన్నారు. శుక్రవారం రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy:), సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి సాగర్ ఎడమ కాల్వకు, లో లెవెల్ కెనాలకు నీటి విడుదల చేశారు. ఆ తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమా ర్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది 6 నుంచి 6.50 లక్షల ఎక రాల చొప్పున ఐదేండ్లలో 30 నుం చి 35 లక్షల ఎకరాల కొత్త ఆయక ట్టు స్థిరీకరించడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. సీఎం రేవంత్ రెడ్డి , డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులంతా కలిసి ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెప్పారు. ఈ ఏడాది బడ్జె ట్ లో సాగునీటి రంగానికి కేటా యించిన రూ.22 వేల కోట్లలో రూ.10,828 కోట్లు పెండింగ్ ప్రాజె క్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామన్నారు. మిగితా 11 వేల కోట్లు ప్రాజెక్టుల కోసం చేసిన అప్పు లు, వడ్డీలు, ఎస్టాబ్లిషెమ్మెంట్ (Debts, Interests, Establishment) ఖర్చు ల కోసం కేటాయించామన్నారు.
బీఆర్ఎస్ (brs) ఒక్క ఎకరాకు నీళ్లి వ్వలేదు… పదేండ్లలో బీఆర్ఎస్ ప్రాజె క్టుల పేరుతో రూ. లక్షా 81 వేల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్ర పు ఆయకట్టు మాత్రమే క్రియేట్ చేసిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళే శ్వరం ప్రాజెక్టుకు రూ.98 వేల కోట్లు ఖర్చు పెట్టి 98 ఎకరాలు కూ డా సాగులోకి తీసుకరాలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజె క్టుకు రూ.31 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరాలో ఆయకట్టు కూడా సృష్టించలేదని విమర్శించారు. సీతారామా సాగర్ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. మేడి గడ్డ బ్యారేజీ పూర్తిగా నాసిరకంగా నిర్మించార ని, నిపుణుల కమిటీ సైతం అదే తేల్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలం వచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదలిపెట్టడం ఇదే తొలిసారి కాగా, పదేండ్లలో ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎప్పుడూ వదలిపెట్ట లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నల్గొండ, ఖమ్మం జిల్లా, ఏపీలో ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లిస్తామని, కాల్వల పొడ వునా ఉన్న చెరువులు, కుంటలను నింపుతామన్నారు. వారం రోజుల్లో సాగర్ రిజర్వాయర్ పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.
రోడ్లు భవనాలు శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)మట్లా డు తూ మూడేండ్లలో శ్రీశైల సొరంగ మార్గం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలి పారు. గ్రావిటీ ద్వారా నీళ్లందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును జానారెడ్డి పట్టుబట్టి సాధించారని, అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రారంభించారని, తర్వాతకాంగ్రెస్ హయాంలో పనులు చేపట్టామన్నా రు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పదేండ్ల నుంచి వసు లు నిలిచిపోయాయని చెప్పారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం ఎంపీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం లో ఎంత కొట్లాడినా పట్టించుకో లేదని, కానీ, ఇప్పుడు ఉత్తమ దా న్ని కూడా పూర్తిచేస్తామని చెప్పడం సంతోషాన్నిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, రోడ్లు యుద్ధ ప్రాతిపాదికన పూర్తిచేస్తామని, గురువర్యులు, సీనియర్ నేత జానారెడ్డి సూచన మేరకు తెలం గాణలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెడ్తామన్నారు. కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సి పాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, పాల్గొన్నారు.