–రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కోమటిరెడ్డికి
–తెలంగాణ స్మాల్ మీడియం న్యూ స్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసో సియేషన్ కృతజ్ఞతలు
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : నల్గొండ జర్నలిస్టులు అందరికీ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి(komati Reddy Venkata Reddy)ఇళ్ళ స్థలా లిచ్చేందుకు కలెక్టర్ నారాయణరెడ్డికి(narayana reddy)అదేశాలివ్వడం పట్ల తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సెక్రటేరియట్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, కోశాధికారి ఆజం ఖాన్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు దాస్ మాతంగి, బొమ్మపాల వెంకటయ్య, గోళ్ళ రమేష్ లు కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి(komati Reddy Venkata Reddy)కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికి .. చిన్న పత్రికల ఎడిటర్లకు (editors)సైతం ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులు(journalist (సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూసీ పునర్జీవ నానికి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తుందని, అందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.
మూసీ కంపుతో నల్గొండ,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని, వివిధ రకాల జబ్బులకు గురవుతున్నారన్నారు. అలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి(cm revanth Reddy)దూరదృష్టితో ఆయా వర్గాలకు మేలు చేసేందుకు ముందుకు వెళ్తుండగా బిఆర్ఎస్ అడ్డు తగలడం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మూసీ పునర్జీవన ప్రక్రియలో తాము సైతం భాగస్వామ్య లవుతామని చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు.