— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి సంక్రాంతి పండ గ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనా లు మరియు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ లను ప్రతీ ఒక్కరు భక్తిశ్రద్ధలతో, కుటుంబ సమేతంగా జరుపుకోవా లని ఆయన పిలుపునిచ్చారు.
మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన సంక్రాంతి పండగ పరమార్ధమని గుర్తు చేసిన మంత్రి. తెలంగాణలో అమలవుతు న్న సంక్షేమం, సుపరిపాలన ప్రగ తిపథంలో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలంతా స్వేచ్ఛా సౌ భాగ్యాలతో సంబురంగా సంక్రాం తిని జరుపుకోవాలని మంత్రి ఆకాం క్షించారు.ఈ సంక్రాంతి పండగ తె లంగాణ బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులను ప్రసాదించాలని ఆకాం క్షించిన మంత్రి ప్రజాస్వామ్యబద్ధం గా సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వానికి దే వుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉం డాలని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.