— ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు
–మునుగోడు లో సర్వేనెంబర్ 10, 45, 78, 359 భూముల పరిశీలన
— రెవిన్యూ అధికారులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy :ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించే కొత్త రోడ్లలో ప్రమాదపు మూలమలుపులు లేకుండా చూడా లని, మూలమలకుల వద్ద భూమి అవసరమైతే సేకరించాలని మును గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంప్ కార్యాలయం లో సమీక్ష సమావేశంలో భద్రతతో కూడిన నాణ్యమైన రోడ్డు నెట్వర్క్ రూపొందించడానికి అవసరమైతే భూమిని సేకరించాలన్నారు. అనం తరం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో ఎమ్మార్వో తో కలిసి ప్రభుత్వ భూములను పరిశీ లించారు. మునుగోడు నియోజకవ ర్గంలో ప్రభుత్వ భూమి ప్రజా అవస రాలకు మాత్రమే ఉపయోగించాల ని, అందరి ప్రయోజనాలకు ఉప యోగపడే ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసుకుంటూ వెళ్తు న్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను రికవరీ చేయాలని చండూరు ఆర్డీ వో శ్రీదేవి, మునుగోడు ఎమ్మా ర్వో నరేందర్ లను ఆదేశించారు.
నియోజకవర్గ కేంద్రంలోని 78, 359 సర్వే నెంబర్లలో వున్న భూమిని రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు…. ఎంత ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది, ఎంత మిగిలి ఉంది, కబ్జాకు గురైన భూమిని రికవరీ చేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించుకోవడానికి ప్రభుత్వ భూమి అవసరం అన్నారు.. అనంతరం సర్వేనెంబర్ 359 ని పరిశీలించి కబ్జా అయిన భూమిని రికవరీ చేయాలని ఆర్డీవో ని ఆదేశించారు… ఈ సర్వే నెంబర్ లలో ఉన్న భూములపై సర్వే చేయించి కబ్జాకు గురైన వాటిని రికవరీ చేస్తూనే ఉన్నవాటిని హద్దులు నిర్ణయించి వాటిని కాపాడాలన్నారు.