బెల్ట్ షాపులు తొలగించాలని మండల మహిళలతో భారీగా ర్యాలీ
Komatireddy Rajagopal Reddy: మునుగోడు ప్రజా దీవెన అక్టోబర్ 26. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆలోచనలతో నియోజకవర్గంలోని మండలాలైన నాంపల్లి మర్రిగూడ చండూర్ చౌటుప్పల్ మండలాల ప్రజలు బెల్ట్ షాపులు తొలగించడానికి గత నాలుగు మాసాలుగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రమంతా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెలిగిపోతుంది రాజన్న ఆలోచనతో కుటుంబంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామని నియోజకవర్గ మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బెల్ట్ షాపులు తొలగించే క్రమం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంపల్లి మండలంలోని మహిళలు వ్యవసాయ పనులు పూర్తిగా బందు పెట్టి ముక్తకంఠంతో.
నిరసన కార్డులతో (Protest card) ఫ్లెక్సీ తో భారీగా తరలివచ్చి మండల మండల కేంద్రమైన బస్టాండ్ నుండి చౌరస్తా వరకు డబ్బులతో డిజెతో భారీగా వేలాదిగా మహిళలతో ర్యాలీ తీశారు. అనంతరం చౌరస్తాలున్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ పూలమాలవేసి నివాళులర్పించారు అక్కడిని మహిళలు పురుషులు కాంగ్రెస్ అభివృద్ధి కమిటీ మెంబర్లు (Committee members)మానవహారం గా ఉండి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తీసుకున్న నిర్ణయాలను ఆలోచనలు ప్రతిజ్ఞ రూపంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ప్రమాణం చేయించారు ప్రమాణం చేయించిన ప్రతిజ్ఞను మేము మా కుటుంబాలతో తప్పక పాటిస్తామని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ఆయనను మహిళలు అభినందించారు మానవహారంలో పాల్గొన్న మహిళ ఆశా కార్యకర్త ఎదురుగా సునీత. సారా సేవించి పురుషులు 25 సంవత్సరాలకే మరణిస్తున్నారని తన పాటల రూపంలో అందరినీ ఆకట్టుకున్నారు మధ్యమహార్ వల్ల తన కుటుంబం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలు బాగున్నాయని ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా త్వరలో రాబోతున్నాడని.
మండల నాయకులు ప్రసంగించారు. అంతేకాకుండా నాంపల్లి మండలానికి రోడ్లు బస్సులు డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయాలని మండల నాయకులకు ర్యాలీలో పాల్గొన్న మహిళలు విజ్ఞప్తి చేశారు అనంతరం నినాదాలతో మండల తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని తాసిల్దార్ దేవ్ సింగ్ కు వినతిపత్రం అందించారు మండల శాఖ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మండలాల్లో బెల్ట్ షాపు లేకుండా చేయడమే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఆశయమని అందుకు మనందరం కలిసి ప్రయాణం చేయాలని అన్నారు. ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం వల్ల నాయకులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య పెద్దిరెడ్డి రాజు గజ్జల శివారెడ్డి దూదిమెట్ల యాదగిరి ఎస్ కే చాంద్ పాషా మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి మాజీ వైస్ ఎంపీపీ బొల్లంపల్లి విష్ణు. వీరమల్ల సందీప్ కామ్శెట్టి యాదయ్య మహిళలు సైదా బేగం బిరుదు యాదమ్మ పూల సైదమ్మ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు