— మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy:ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో వర్షాకాలం సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబల కుండా ఉండాలంటే ముం దుగా మరుగు నీటి నిలువ లేకుం డా చేయాలని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అధి కారులను సూచించారు. సోమవా రం ఆయన మునుగోడు పట్ట ణం లోని పలు వీధులలో మురుగు నీరు నిల్వ ఉన్న డ్రైనేజీలను పరిశీ లించారు. చుక్క వర్షం వచ్చినా నీరు నిలవకుండా కిందికి వెళ్లే విధం గా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గృహ సముదాయాల (Housing complexes)మధ్య కాలి ప్లాట్లలో నీటి నిల్వ చేరి పందులకు, దోమల కి నిలియంగా మారడంతో ఫ్లాట్ యజమానికి వెంటనే నీటి నిలువ (Water level)లేకుండా చేయాలని చెప్పారు. ఇరుకుగా ఉన్న డ్రైనేజీలను వెడల్పు చేయాలని, డ్రైనేజీల మీద కట్టడాలను కూల్చివేసి మురుగునీ రు సాఫీగా వెళ్లేలా చూడాలని స్పెష ల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. స్థానిక నాయకులతో కలిసి పలు వీధుల్లో తిరుగుతూ డ్రైనేజీలను (Drainages) పరిశీలించి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఆ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఆయన వెంట జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, స్ధానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.