Komatireddy Rajagopal Reddy: అయ్యప్ప సేవలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ప్రజా దీవెన: తెలంగాణ రాష్ట్రం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం పట్ల నాంపల్లి చండూర్ అయ్యప్ప స్వాములు చాలా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున చండూర్ మండల కాంగ్రెస్ నాయకులు గంట సత్యం గురుస్వామి పెద్ద అంబర్పేట్ నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి హాజరై స్వామివారికి అభిషేకం నిర్వహించారు. స్వామివారి పాటలను భజనలను శాసనసభ్యులు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.
అయ్యప్ప స్వాములను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో నేను స్వామి దీక్షను చేశానని దీక్షలో క్రమశిక్షణతో జీవన ప్రయాణం సాగుతుందని ఆరోగ్యంగా ఉంటామని భక్తులతో తన అనుభవాలను గుర్తు చేశారు పడిపూజ కార్యక్రమానికి శాసనసభ్యులు సమయం ఇవ్వడంతో స్వాములు కాలనీ ప్రజలు స్వామివారి భజనలతో కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలుకోరి బిక్షం, కార్యదర్శి కామిశెట్టి యాదయ్య నాంపల్లి, భక్త మార్కండేయ సంఘం కమిటీ మెంబర్ సంఘపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.