— మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు నియోజకవర్గ పరిధి లో బెల్ట్ షాపుల నిర్మూలనపై త నపై వ్యతిరేకత వచ్చినా వెనక్కి తెగ్గదేలేదని మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)తేల్చి చెప్పారు. మంగళవారం బెల్ట్ షాపులను తామే స్వచ్ఛందంగా మూసివేస్తున్నామని ముందుకు వచ్చిన మండలంలోని ఊకోండి గ్రామానికి చెందిన బోయినపల్లి శంకరయ్య, బోయినపల్లి వెంకన్నలను హైదరాబాద్ లోని (hyd) ఆయన నివాసంలో స్థానిక గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందిం చారు. ఈ సందర్బంగా ఎంఎల్ఏ (MLA)మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధితో పాటు ‘తాగుడు ‘ అనే మహమ్మారిని తరిమి కొట్టాలన్నదే తన సంకల్పం అని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది అన్నారు. క్రమక్రమంగా బెల్ట్ షాపులను (Belt shops) తామే మూసివేస్తామంటూ నిర్వాహకులు ముందుకు రావడం హార్షణీయ మన్నారు.ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో మహిళలు పురుషులతో కలిసి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు వేయడంతో ఆ కమిటీల ద్వారా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి మద్యం అమ్మకాన్ని అరికట్టామన్నారు. సమాజ శ్రేయస్సు కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం ఫలితాలను ఇస్తుంది అని జీవితంలో ఇంత కన్నా ఏమి కావాలి అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎంపీపీ మేడి నాగలక్ష్మి యాదయ్య, తాజా మాజీ సర్పంచ్ నడింపల్లి యాదగిరి,యువజన కాంగ్రెస్ నాయకుడు మాదగోని రుషికేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధగోని దేవలోకం, భీమగోని ముత్యాలు,భీమగోని స్వామి తదితరులు పాల్గొన్నారు.