మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి
Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన,సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని వెంకంబావి తండా,తుంబావి తండా, కడిలబావి తండా,రాచకొండ తాండలను కలుపుకొని నూతనంగా రాచకొండ ఎంపీటీసీ ని ఏర్పాటు చేయాలనీ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సంబంధిత గ్రామాల గిరిజన నాయకులు కలిసి వినతి పత్రం చేశారు.ప్రస్తుతం గుడిమల్కాపురం ఎంపీటీసీ పరిధిలో గుడిమల్కాపురం, కోతులాపురం,మహమ్మాదాబాద్,వెంకంభావితండా,తుంబావి తండా,కదిలాబావి తండా,రాచకొండ తండా,ఐదొనల్ తండా లు దాదాపు 35 కిలోమీటర్లు విస్తీర్ణం కల్గి ఉండటం చేత ఇబ్బందులు కల్గుతున్నాయని ఆయా గ్రామాల నాయకులు తెలియజశారు.
గుడిమల్కాపురం ఎంపీటీసి పరిధిలో మొత్తం 4000 లకు పైగా ఓటర్లు ఉండగా అందులో వెంకంబావి తండా,తుంబావి తండా,కదిలాబావి తండా,రాచకొండ తండా,దొనల్ తండా లలో 2000 ఓట్లు ఉన్నందున రాచకొండ పేరున నూతనంగా ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయాలనీ కోరారు.అదేవిదంగా నారాయణపురం మండల కేంద్రంలో కూడా మరో ఎంపీటీసీ స్థానాన్ని,పుట్టపాక గ్రామంలో కూడా మరో ఎంపీటీసీ స్థానాన్ని పెంచాలని పలువురు నాయకులు సూచించారు.ఈ విషయాన్ని పరిశీలన చేయాలనీ మండలం అభివృద్ధి అధికారులకు,జిల్లా అధికారులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని నాయకులు తెలిపారు.
వచ్చే ఎన్నికల నాయకులు కోరుతున్నానట్లుగా ఆయా నూతన ఎంపీటీసీ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నాయకులు ఆశభావం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రములో జిల్లా,నాయకులు గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ బుజ్జి నాయక్,డీసీసీ ఉపాధ్యక్షులు మండుగుల బాలకృష్ణ,డీసీసీ కార్యదర్శులు కరెంటోతూ బిక్షపతి నాయక్,ఏపూరి సతీష్,మండలం అధ్యక్షులు శ్రీను నాయక్,జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ పనుగోతు బాలు నాయక్,మల్లేపల్లి ప్రముఖ రెడ్డి,మన్నే నర్సిరెడ్డి,ధనంజయ్ గౌడ్,విరమళ్ళ వెంకటేష్,కురిమిద్దె గోపాల్,కత్తుల లక్ష్మయ్య,సభవత్ గోవర్ధన్ నాయక్, సాగర్ నాయక్ శ్రీను నాయక్,రవి నాయక్,ఎస్టి సెల్ అధ్యక్షులు కారంతోతూ రమేష్ నాయక్,జరుపుల జగన్ నాయక్,పాల్గొన్నారు.