Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ మార్కండేశ్వర దేవాలయ కమిటీ
Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవన,నారాయణపూర్ : సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర దేవాలయం 26వ వార్షికోత్సవాలు ఫిబ్రవరి రెండు నుండి ఐదో తేదీ వరకు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనాలని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలసి ఆహ్వానించిన మార్కండేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు సూరపల్లి కుచేలు,మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి,మునగాల రమణారెడ్డి,దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు చేరిపల్లి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి కర్నాటి నవీన్ కుమార్,కార్యవర్గ సభ్యులు దోర్నాల అంజయ్య,గంజి రాములు,మాకం రామకృష్ణ సూరపల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు