Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy Rajagopal Reddy: సింగారంలో పరిశుద్ధ సమస్య పరిష్కరిస్తాం

— మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన మునుగోడు: మునుగోడు మండలoలోని సింగా రం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) శుక్రవారం ఉదయం పర్యటిం చారు. ముందుగా గ్రామంలోని పలు వార్డులలో తిరిగి ప్రజాలె దుర్కొంటున్న డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు ఇతర సమస్యలను తెలుసు కొని వెంటనే సంబంధిత అధికా రులకు ఆదేశించారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిం చాలని, మునుగోడు నియోజ కవర్గంలో (Earlier in the constituency) సింగారం మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే (mla) అధికారులను ఆదేశించారు. సమ స్యలను నేరుగా తెలుసుకొని పరి స్కారానికి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో గ్రామాల్లో పర్యటిస్తు న్నానని, అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. సింగారo గ్రామ అభివృ ద్ధికి ప్రత్యేక చొరవచూపుతానని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలో నూరుశాతం మద్యం అమ్మకాలను బంధు చేయించడం పట్ల ప్రజలను అభినందించించిన ఎమ్మెల్యే గ్రామానికి ప్రత్యేకంగా వెంటనే 10 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నానని , అత్యవసరమైన పనులు చేయించుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు (mal)పలు సమస్యలతో కూడిన వినతిపత్రంను గ్రామస్థులు అందజేశారు. ముందుగా ఎమ్మెల్యేను పలువురు శాలువాలు, పూలబొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,(DCCB Chairman Kumbham Srinivas Reddy) జిల్లా పంచాయతీ అధికారి మురళి, వివిధ శాఖల అధికారులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ నరేష్, పంచాయతీ కార్యదర్శి గీత, మండల కాంగ్రెస్ అద్యక్షుడు భీమనపల్లి సైదులు, జాజుల ఆంజయ్య, పాల్వాయి చెన్నారెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, జాల వెంకన్న, మేకల మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కుంభం చెన్నారెడ్డి, మాజీ సర్పంచులు కోడి చంద్రయ్య, పోగుల జానకి ప్రకాష్, జిల్ల లక్ష్మమ్మ వెంకటేష్, ఉప్పునూతల రమేష్, గ్రామ సీనియర్ నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.