–రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫి శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komatireddy Venkat Reddy: ప్రజా దీవెన, యాదాద్రి : పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మదర్ డెయిరీ చైర్మెన్, డైరెక్టర్లు పని చేయాలని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. శనివారం హయత్ నగర్ (Hayath Nagar) లోని మదర్ డెయిరీ (Mother Dairy) లోని నూతన చైర్మెన్ ఎన్నికలో పాల్గొని మాట్లాడారు. నూతన చైర్మెన్ గా ఆలేరు నియోజకవర్గం లోని తుర్కపల్లి మండల కేంద్రా నికి చెందిన గుడిపాటి మధుసూదన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీల కతీతంగా మదర్ డెయిరీని బాగుచేసుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే రూ.4ల బోనస్ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం తన బినామీ ద్వారా పేరుతో చేసిన మోసలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపలాడిన బాధ్యత ప్రజల పైన ఉందన్నారు. మదర్ డైరీని లాభాల బాటలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఉమ్మడి నల్లగొండ (nalgonda), రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలలో అన్ని ప్రభుత్వ స్కూల్ లకు, హాస్టల్ లకు హాస్పిటల్ లకు మదర్ డైరీ పాలను సరఫరా చేయాలని ఉమ్మడి నల్లగొండ, రంగా రెడ్డి జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కా ర్యాలయాల్లో మదర్ డైరీ పాలనే ఉపయోగించేలా చర్యలు తీసు కోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కు మదర్ డైరీ నుండే లడ్డుల తయారీకి నెయ్యిని సరఫరా చేయాలని సూచించారు. శ్రీజ కంపెనీ (Srija Company) ఇచ్చిన పాత జీవోను రద్దు చేయాలని మంత్రిని కోరారు.
మాజీ మంత్రి హరీష్ రావు బినామీ కంపె నీల పేర్లతో యాదగిరిగుట్ట వేములవాడ దేవస్థానలలో లడ్డుల తయారీకి హరీష్ రావు బినామీలకు కాకుండా మదర్ డైరీ నుండి నెయ్యి తరలింపును వెంటనే ప్రారంభించాలని మంత్రి కొండా సురేఖను కోరారు. వీటి ద్వారా అప్పులో ఉన్న 60 కోట్ల రూపాయలు మదర్ డైరీ అప్పును తీర్చే అవకాశం ఉందని, గత ప్రభుత్వం చేసిన బర్లు, గోర్లు కాకుండా పాల ఉత్పత్తిలో దోపిడీ చేశారని ఆరోపించారు. మా ప్రభుత్వం మదర్ డైరీ అభి వృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
నూతన చైర్మెన్ కు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Ilayya), భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar reddy), చైర్మెన్ శ్రీకర్ రెడ్డి, డైరెక్టర్ లు గొల్లపల్లి రాంరెడ్డి, కల్లేపల్లి శ్రీశైలం, పాండు, నరేందర్ రెడ్డి, జంగయ్య, నర్సింహా రెడ్డి, నర్సింహులు, మాజీ చైర్మెన్లు గుత్తా జితేందర్ రెడ్డి, గంగుల కృష్ణా రెడ్డి, ఆలేరు మార్కెట్ చైర్మెన్ చైతన్య రెడ్డి, నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, సిల్వేరు బాలరాజు, నామిల మహేందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, శంకర్ నాయక్, రాజు, రాంజీ నాయక్, విఠల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.