Konda Nagayya Goud Trust: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ పట్టణo 8 వ వార్డ్ కడపర్తి రోడ్ లోని రాచకొండ భిక్షప తి గౌడ్ (Bhikshapa Thi Gaud) చిన్న కుమారుడు రాచ కొండ సాయి కిరణ్ గౌడ్ ఆకాల మరణం చెందగా కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ (Konda Nagayya Goud Trust)ద్వారా ఆర్ధిక సాయం అందజేశారు. నకిరేకల్ మున్సిపా లిటీ 7 వ వార్డ్ కౌన్సిలర్ అయిన కొండ శ్రీను గౌడ్ మంగళవారం రాచ కొండ భిక్షపతి ని పరామర్శించి వారి కుమారుని మృతికి సంతాపం తెలిపి ఓదార్చడం జరిగింది .
ఈ సంధర్బంగా కీ, శే , కొండ నాగయ్య గౌడ్ ట్రస్ట్ (Konda Nagayya Goud Trust) ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొండ శ్రీను గౌడ్ రాచకొండ భిక్షపతి గౌడ్ కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయం (Financial assistance)చేశారు.ఈ కార్యక్రమం లో నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్, మరియు సొసైటీ ఉపాధ్యక్షులు భూపతి వెంకట్ నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి చనగానీ రవి గౌడ్, కోశాధికారి కొండ యాదగిరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మాదగొని వెంకన్న గౌడ్, చౌగోని వెంకన్న గౌడ్, సభ్యులు గిరగాని శంభయ్య గౌడ్ , రాచకొండ జానయ్య గౌడ్, రాచకొండ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.