–కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టు కున్నoదుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
–టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కొండేటి మల్లయ్య
Kondeti Mallaiah : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ముప్ఫైఏళ్ళ ఎస్సీ వర్గీకరణ పోరా టానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరిగిందని టిపిసిసి రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్ల య్య అన్నారు. శనివారం నల్గొండ లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడు తూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామ ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి నిలబెట్టుకున్నాడని అన్నారు. వర్గీకరణపై నలుగురు మంత్రులతో కమిటీ, హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ తో ఏకసభ్య కమిష న్ వేసిందని తెలిపారు. కమిషన్ రి పోర్ట్ ఇచ్చిన వెంటనే ఈనెల 4న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆ మోదం తెలిపి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని అన్నారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ అ మలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇత ర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచా డని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామో దరం రాజనర్సింహకు, మంత్రివర్గా నికి ఈ సందర్భంగా కొండేటి మల్ల య్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా రు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలకు, మాదిగ ఉప కులాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
వర్గీక రణ సాధన కోసం మాదిగలు గత 30 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వర్గీక రణ సాధన కోసం పోరాటాలు చేశా రని పేర్కొన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యపడిందని తెలి పారు. దేశంలో ఎక్కడా లేనివిధం గా తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిగా ఎస్సీ వర్గీకరణ చేయ డం జరిగిందని అన్నారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉండి అమలు చేసే వరకు కృషి చేసిందని అన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి మాదిగలు రుణపడి ఉం టారని అన్నారు.ఎస్సీలలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా వారి జనాభా ప్రకారం వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి జాన య్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పెరిక వెంక టేశ్వర్లు, తోలకోప్పుల గిరి, నాగా ర్జునసాగర్ నియోజకవర్గ నాయ కుడు నకరేకంటి సైదులు, కొండ భాస్కర్, కొండేటి శంకర్ తదిత రులు పాల్గొన్నారు.