–సింగరేణి బొగ్గు గనులు అమ్ముతా మoటే చూస్తూ ఊరుకోం
–సింగరేణిలో ఇంచు స్థలం అమ్మినా ఆందోళనకు దిగుతాం
–బీఆర్ఎస్ ఉద్యమాల గురించి కాంగ్రెస్, బీజేపీలకు బాగా తెలుసు
–కేంద్ర మంత్రి అయ్యి పది రోజులు కాకముందే కార్మికుల నోట్లో మట్టి కొడతావా
–సింగరేణి కాపాడుకునేందుకు జంగ్ సైరన్ మోగిస్తాం
–కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహo
Koppula eshwar: ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణకు సింగరేణి (Singareni) కొంగుబంగారం (Kongubangaram ) అని, సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి దక్షిణ భారతానికే వెలుగురేఖ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula eshwar)పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి (Singareni)సంస్థ లక్షలాది మంది గ్రా మీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చి నటువంటి సంస్థ అని చెప్పారు. అ నేక పరిశ్రమలకు ఈ రాష్ట్ర అభి వృ ద్ధికి తోడ్పడ్డ సంస్థ సింగరేణి సంస్థ 133 సంవత్సరాల చరిత్ర కలి గిన ఈ సంస్థలో లక్షలాది మందికి ఉపా ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లో ప్రముఖంగా నిలిచినటు వంటి సంస్థ సింగరేణి సంస్థ అని గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నప్పటి కీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనం లో నిర్వహిస్తూ, ఒకనాడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నటువంటి ఈ సంస్థ కార్మికులు మరియు యాజమాన్యం యొక్క సమిష్టి కృషితో అనేక సంవత్సరాలుగా లాభాలను ఆర్జించిన సంస్థ సింగరేణి సంస్థ కొన్ని కొనియాడారు.
గత సంవ త్సరంలో కూడా 32 శాతం లాభాల వాటాను శ్రామికులకు అందించిన టువంటి సంస్థ అని, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కూడా దీనిని ప్రవేట్ (private) పరం చేయ వలసినటువంటి ఒక దుర్మార్గమైన టువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.ఇది తె లంగాణ రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని, ఎప్పుడైనా నష్టా ల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వ డం గానీ లేక వేలం వేయడం గానీ చేస్తామని, కాని ఇక్కడ లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేయడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు.9 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన ఏ ఒక్క బొగ్గు గనిని (coal mine) కూడా ప్రైవేట్ పరం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారని వివ రించారు. అయినప్పటికీ మన ప్రధా ని నరేంద్ర మోడీ (pm modi)నిన్నగాక మొన్న బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kisan reddy) దేశంలో ఉన్న అనేక గనులతో పాటు సింగరేణి బొగ్గు గనులను కూడా వేలం వేయడానికి నిర్ణయం తీసుకోవడం దురదృష్టక రమన్నారు. సింగరేణి గనులను వేలం వేయడమే తొలి కార్యక్ర మంగా తీసుకున్న ఘనుడు కిషన్ రెడ్డి అని, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టడానికే కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ మంత్రి పదవి ఇచ్చినట్టున్నడు ప్రధాని మోడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు నీకు పట్టవా, సింగరేణి బొగ్గు గనులు అమ్ముతాం అంటే చూస్తూ ఊరుకోమని, సింగరే ణిలో ఇంచు స్థలం అమ్మినా ఆందో ళనకు దిగుతామని, సింగరేణి ప్రైవే టుపరం చేస్తే జంగు సైరన్ మోగి స్తామని హెచ్చరించారు. వేలం అంటేనే ప్రైవేటీకరణ రేపు జరిగే 90 బొగ్గు బావుల వేలంలో సింగ రేణి సంబంధించిన శ్రావణపల్లి (Sravanapalli) కూల్ బ్లాక్ కూడా ఉందని, ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా చేస్తున్న కుట్ర అని చెప్పారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు బిజెపి ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదే నా అని ప్రశ్నించారు.బొగ్గు గను ల వేలాన్ని అభ్యంతరం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి (revanth reddy) మోడీని ఆహ్వానిస్తు న్నాడని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వేలాన్ని వ్యతిరేకిస్తూ మోడీకి లేఖ రాసిండని, మరి ఇప్పు డు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్ర ధానికి ఎందుకు లేఖ రాయట్లేదని, బొగ్గు బావుల వేలం వద్దని ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదని, స్వయంగా డి ప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేపు వేలం కార్యక్రమంలో పాల్గొనబో తున్నారని, వేలంలో పాల్గొనడం అంటే, బొగ్గు బావుల మీద సింగరే ణి హక్కులేదని ఒప్పు కోవడమే నని, సింగరేణికి నేరుగా కోల్ మైన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, వేలం వేయడం తప్పులేదు అని అంగీ కరిస్తున్నారని ధ్వజమెత్తారు. సింగ రేణి కార్మిక సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించాలని, గుర్తిం పు సంఘంగా ఉన్న AITCU స్పష్టత ఇవ్వాలని, వేలాన్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న తీరుపై మిత్రపక్షం సిపిఐ నేతలు ఏమంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణా రావు, గంగుల అశోక్ పాల్గొన్నారు.