Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Koya Sriharsha: తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు

–ఆరు ఎకరాల భూమిని తిరిగి తం డ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్
–తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా చర్యలని ప్రకటన

Koya Sriharsha: ప్రజా దీవెన, పెద్దపల్లి: వృద్ధాప్యం లో తల్లిదండ్రులను పట్టించుకో వట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ ను తిరిగి తండ్రి పేరి ట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Koya Sriharsha) ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామి రెడ్డికి వివిధ సర్వే (survey)నంబర్లలోని తనకున్న 6 ఎక రాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ (Gift Deed) చేశారు. అయితే కొంతకాలంగా తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి (Bapureddy) గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసేందుకు దరఖాస్తు సమర్పించారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరువ ర్గాలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు.

ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ నిర్ధారిం చారు. దీంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను (Gift Deed) రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు. అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామి రెడ్డి, కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుంద ని.. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు (Legal actions) తీసుకుంటామని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.