Koyada Ravi Teja : ప్రజాదీవెన : అమెరికాలోని కనక్టికట్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న కొయ్యడ రవితేజ దారుణ హత్యకు గురయ్యాడు. ఒక రాబరీ కేసులో దోపిడీ దొంగలు తప్పించుకునే ప్రయత్నంలో బలవంతంగా రవితేజ కారు లో పారిపోయే ప్రయత్నం లో రవితేజ పై కాల్పులు జరిపి కారు తీసుకొని పారిపోయారు. దోపిడీ దొంగల కాల్పుల్లో మరణించిన రవితేజ తల్లిదండ్రులు కొయ్యడ చంద్రమౌళి సువర్ణ వీరి సొంత ఊరు కొయ్యలగూడెం చాలా కాలం నల్గొండ పట్టణంలో తిరుమల నగర్ లో నివాసం ఉండి ఈమధ్య హైదరాబాద్ కు నివాసం మార్చారు.
రవితేజ హత్య పట్ల నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని,ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, జి ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.