Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Krishna Mohan Rao: బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళిక

–స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ధమాషా మేరకు రిజర్వేషన్లు
–బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళ భరణం కృష్ణ మోహన్ రావు

Krishna Mohan Rao: ప్రజా దీవెన, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ధమాషా మేరకు రిజర్వేషన్లు అమలు కా వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళిక లు అందజేశామని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణ మోహన్ రావు (Krishna Mohan Rao)తెలిపారు. శని వారం యాదాదీశ్వరుని కుటుంబ సమే తంగా వచ్చి దర్శించుకున్నా రు. స్వామివారి సన్నిధిలో గడప డం ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావు (Evo Bhaskara Rao)స్థానిక ఆర్డీఓ జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆయన దర్శన ఏర్పాట్లలో పాల్గొ న్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు, అర్చక స్వాములు ఆయనకు వేద ఆశీర్వచనం అంద జేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆలయం వెలుపల వకుళాభరణం విలేకరులతో కాసేపు మాట్లాడారు. మూడేళ్ల పదవీకాలం ఎంతో ఆత్మ సంతృ ప్తిని ఇచ్చిందన్నారు. మూడేళ్ల పదవీ కాలంలో అంకిత భావంతో పనిచేయగలిగానని, పదవులు నిర్వహించడం తన జీవితంలో కొత్తవి కాదని, ఏ జాతుల హక్కుల కోసం కృషి చేశానో ఆ వర్గాలకు చెందిన బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేయడం తన జీవితంలో మధుర ఘట్టమ‌ని ఆయన తెలిపారు.

కుల గణనకు (Caste enumeration)ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వా నికి ఇచ్చానని చెప్పారు. బలహీన వర్గాలు కులగణన నిర్వహించాలని చిరకాలంగా కోరుతున్నారని, అది ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి శక్తిని ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి మహత్తర ఘ ట్టంలో కులగణ‌న‌ చేపట్టాలని తీర్మా నం చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం రావడం, ఇంటింటి సర్వే నిమిత్తం ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసే కార్యాచర ణలో భాగం అవడం జీవితంలో గొప్ప సంఘటనగా గుర్తుండి పోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

తన పదవి కాలం ఈ రోజుతో ముగుస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీలలోని సంచార విముక్తి జాతుల కులాలు ఇప్పటికీ ఆధునిక అభివృద్ధిని అందుకో లేకపోతున్నారని, కుల సర్వే పూర్తి అయ్యాక వచ్చిన సమగ్ర సమాచా రంతో వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదల తీసుకురావాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.స్థానిక సంస్థల్లో డెడి కేటెడ్ కమిషన్ గా బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను నిర్ణయించడానికి విశేషంగా కృషి చేశానని, అయితే గడువు ముగియడం కారణంగా తుది నివేదిక ఇవ్వకుండానే నిష్క్ర మించడం కొంత ఇబ్బంది కలిగి స్తుందని ఆయన అభిప్రాయప డ్డారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కోరుతున్న విధంగా ప్రజా ప్రాతిని ధ్యం పెరగాలని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తన పదవీ బాధ్యతలను కొనసా గించడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.