Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Krishna river : జుట్టుపట్టుకుంటున్న జూరాల అధి కారులు,వెంటాడుతున్న నీటి లీక్ సమస్య

Krishna river : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై అధికారులు జుట్టుపట్టుకుంటు న్నారు. వారు వీరు అనే తేడా లేకుండా అంతటా అందరిలో అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. 2021లో రిపేరు పనులు ప్రారంభించగా ఇప్పటి వర కు కేవలం 25% పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. గేట్లు రోఫ్ డామేజ్, గేట్ల నుంచి నీటి లీకేజీల రిపేర్ ప నులు మాత్రం ఇప్పటి వరకు చేయ లేదు దీంతో నీటి లీకేజీ సమస్య పె ను సమస్యగా మారింది.ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం జూరాల ప్రాజె క్టు నిండుకుండలా ఉంది. ఈ వర్షా కాలంలో కురిసిన భారీ వర్షాల కార ణంగా ప్రాజెక్టులోని పలు గేట్లు డ్యా మేజ్ అయిన సంగతి తెలిసిందే. అ యితే గత సీజన్లో అయినా డ్యామే జ్ కారణంగా ప్రజెక్టును నేటికి లీకే జీ సమస్య వెంటాడుతుంది.

 

ప్రస్తు తం డ్యామ్ లోని 12 క్రస్ట్‌ గేట్ల నుం చి కంటిన్యూ గా నీరు లీక్‌ అవు తుంది. ఇందులో 8 క్రస్ట్‌ గేట్ల రోప్‌ డ్యామేజ్‌ అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.అలాగే గత సీజన్‌లో అయిన డ్యామేజ్‌లకు మరమ్మతులు చేయక పోవడంతో తుప్పుపట్టి గేట్లకు అమర్చిన రబ్బ ర్లు ఊడిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో అధికంగా నీరు లీక్ అవుతుండగా ప్రాజెక్టు అధికారు లకు ఎం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు 12 గేట్ల నుంచి లీకేజీతో నీరు వృధాగా పోతుండటంతో స్థానిక ప్రజలు ఆం దోళనకు గురవుతున్నారు. కంటి న్యూగా నీరు లీక్ అయితే వచ్చే వేసవి నాటికి జూరాల ప్రాజెక్టు నీటి పై ఆదారపడిన ప్రజలకు నీటి సమ స్య ఏర్పడే అవకాశం ఉంది. అలా గే జూరాల ప్రాజెక్ట్‌ భద్రతపై అధికా రులు చూసి చూడనట్లు వ్యవహరి స్తున్నారని, మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.