–సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజినల్ డైరెక్టర్ శ్రీ జి కృష్ణమూర్తి
Krishnamurti:ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం మరియు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వ ర్యంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల సుస్థిర యాజమాన్యం నలగొండ జిల్లా పరిశీలన అంశంపై జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు ముగింపు సమావే శంలో జి కృష్ణమూర్తి (Krishnamurti) మాట్లాడుతూ భూగర్భ జలాల సుస్థిర యాజమా న్యంలో విద్యార్థుల పాత్ర కీలకం అన్నారు. సవాళ్లను అధిగమిం చేందుకు విలువైన మానవ పనురుల అవసరాన్ని గుర్తించి విశ్వవిద్యాలయ వేదికగా నిష్ణాతులను తయారు చేయడం తమ ప్రధాన ఉద్దేశం గా పేర్కొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో 15 అంశాలను కూలంకుషంగా చర్చించడం తో పాటు క్షేత్రస్థాయిలో ప్రయోగాల ను సైతం విద్యార్థులకు వివరించిన ట్లు తెలిపారు. ఉపరితల జలాల వినియోగంపై దృష్టి సారించ డంతోపాటు భూగర్భ జలాల పెంపుకు శాస్త్రీయ పద్ధతులపై దృష్టి సారించాలన్నారు.
రూఫ్ టాప్ హార్వెస్టింగ్ (Roof top harvesting)పద్ధతులను అవలంబిస్తున్న బెంగుళూరు మెట్రోపాలిటన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుకు కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ భూగర్భ జలాల అట్లాస్ ను దక్షిణ ప్రాంత కార్యాలయం తయారు చేయడం గర్వకారణం అని యువ శాస్త్రవేత్తలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. రాబోవు రోజుల్లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు మరిన్ని కార్యక్రమాలను రూపొం దించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. శిక్షకులు తమ జ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు వివరించి విలువైన భూగర్భ జలాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ (Anjireddy Science College Principal) డా ప్రేమ్సాగర్, జియాలజీ విభాగం అధ్యాపకులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు, మచ్చేందర్, సుధాకర్ వెంకటేష్, శాస్త్రవేత్తలు రాణి, విట్టల, యాదయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.