Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KRR College: ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హీ సేవలో భాగస్వాములు కావాలి

KRR College: ప్రజా దీవెన, కోదాడ: ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హి సేవలో భాగస్వామ్యులు కావాలని కోదాడ కెఆర్ఆర్ కళాశాల (KRR College) ప్రిన్సిపాల్ చందా అప్పారావు,(apparao) అగ్నిమాపక కేంద్ర అధికారి సిహెచ్ శ్రీనివాస్ అన్నారు కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవపథకం (National Service Scheme in Government Degree College) మూడు యూనిట్లు సంయుక్తంగా స్వచ్ఛతహీ సేవ కార్యక్రమాని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని అవగాహన గాని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ . ప్లాస్టిక్ రహిత సమాజ (A plastic free society)నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని,ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గిస్తే కాలుష్యాన్ని నియంత్రిచ వచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ,మరియు NSS ప్రోగ్రాం ఆఫీసర్స్ డా. ఎన్.నిర్మల కుమారి,వి. వెంకటేశ్వర రెడ్డి,కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, అధ్యాపకులు సైదులు,రాజు,శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.