Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలి

–స్పీక‌ర్ ను క‌ల‌సిన కెటిఆర్ నేతృ త్వంలోని బిఆర్ఎస్ బృందం
–త‌క్ష‌ణం వారిని అన‌ర్హులుగా ప్ర‌క‌ టించాల‌ని విన్న‌పం
–3 నెల‌ల్లో చ‌ర్య‌ల గత సుప్రీం తీ ర్పును స్పీక‌ర్ దృష్టికి తెచ్చిన టీం
–ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌పై కూడా స‌భాప‌తికి పిర్యాదు చేసిన వైనం

KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ్యుల పార్టీ ఫిరా యింపుల వ్యవహారం శాసన సభా పతి చెంతకు చేరింది. బిఆర్ఎస్ నుంచి ఎమ్మ‌ల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిఆర్ఎస్ (brs)ప్ర‌తినిధుల బృందం తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ను కోరింది మాజీ మంత్రి, ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (ktr) నాయ‌క‌త్వంలోని ఎమ్మ‌ల్యేల బృందం మంగళవారం స్పీక‌ర్ ను ఆయ‌న కార్యాల‌యంలో క‌లిసి ఈ మేరకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ సంద‌ర్బంగా నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లం ఘనలు పార్టీ ఫిరాయింపులపై స్పీక ర్‌కు కెటిర్ ఈ మేర‌కు ఆయ‌న వివ‌ రాల‌తో కూడిన లేఖ‌ను అంద‌జే శారు. అనంతరం అసెంబ్లీ మీడి యా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ (KTR talking to the media), ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయిం పులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామ న్నారు. పార్టీ ఫిరాయింపుల అంశా న్ని సభాపతి దృష్టికి తెచ్చామ న్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డా రన్నారు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పును సభాపతికి గుర్తు చేశామ‌న్నారు.

ఫిరాయింపులపై (deviations)వచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్పీకర్‌కు చదివి వినిపించా అని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా న్యాయ్ పత్ర అంటూ మేనిఫెస్టో విడుదల చేసిందని అం దులో స్పష్టంగా ఫిరాయింపులు చే సిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో (Congress MLA BJP) చేరితే ఇదే హ స్తం పార్టీ కొట్లాడుతోందని తెలిపా రు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లను బీజేపీ రూ.50 కోట్లకు కొంటుం దని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తు న్నారని కేటీఆర్ తెలిపారు.గోవాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ఇచ్చే సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారితో పార్టీ మార బోమని ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. హిమాచల్ రాజ్య సభ ఎన్నికలు, మహారాష్ట్ర పరిణా మాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టి కి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనల న్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలం గాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల (mla) సభ్యత్వాలు వెంటనే రద్దు చేయాల ని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటా మ‌ని స్పీక‌ర్ (speaker) హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు.