Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం అంబెడ్కర్ ను అవమానిస్తుంది

–మాజీ మంత్రి కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: కేసీఆర్ దళిత బంధు తెస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తామ న్నారని, ఏడాది కాలమైనా దళిత బంధు లేదు, అభయహస్తమూ లేదని, దళిత బంధు అడిగితే దళితులపై కేసులు పెడుతున్నారని ఇదేనా అంబేద్కర్‌కు మీరిచ్చే నివా ళి అని బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్( KTR) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ నివాళులు అర్పించి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని చాటే లా సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రపంచంలో ఎక్క డా లేని విధంగా అంబేద్కర్ 125అ డుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశార న్నారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాం వద్ధ ఏలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎందు కు అవమానిస్తుందని నిలదీశారు. దీనిపై అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానించే వైఖరిలో భాగంగానే ఇలా చేస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అంబేద్కర్ వర్సీస్ పథకంతో 7వేల మంది విద్యార్థులను విదేశాలకు పంపిస్తూ రెండో విడత నిధులను విడుదల ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా వారిని ఇబ్బంది పాలు చేస్తుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో మేం 1000 గురుకు లాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్నించిన బీఆర్ ఎస్ నేతలందరిని అరెస్టులు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అపహస్యం చేస్తుంద న్నారు.

కాంగ్రెస్ అగ్రనేత సంభల్ కు వెళ్లేందుకు అడ్డుకుంటే రాజ్యాంగం హక్కులపై మాట్లాడుతున్నాడని, అదే మేం లగచర్ల వెళితే వారి పార్టీ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడితే స్పందించడం లేదన్నారు. మా పార్టీ నేతలపై అక్రమ, కేసులు పెడుతు న్న ప్రభుత్వంపై వెనక్కి తగ్గకుండా డిసెంబర్ 9న జరిగే అసెంబ్లీ సమా వేశాల్లో నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.లగచర్ల, గురుకులా లు, సమస్యలపై అసెంబ్లీలో నిలదీ స్తామని, కనీసం నెల రోజులు సమావేశాలు జరుపాలని మేం కోరుతున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన సంస్కారానికి నిదర్శనమని, కేసీఆర్ పైన, మాపైన రేవంత్ చేసే విమర్శలను పదింతలు ధీటుగా తిప్పికొడుతామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ హాజరు సమస్య కాదని, అసలు ఆ తల్లి ఏవరో ఇప్పటికి స్పష్టత లేదన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ తల్లి విగ్రహాలు రూపు రేఖలు మార్చడం సరికాదన్నారు.