–అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR)పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారన్నారు. పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని కేటీఆర్ శాసన సభలో (KTR Legislature) తెలిపారు. రాష్ట్రంలో శాం తి, భద్రతలను కాపాడటంలో రాజీ పడబోమని, ఎవరిపై వేధింపులు ఉండబోవని శాసనసభ వ్యవహరా ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పగా దీనిపై కేటీఆర్ స్పందిం చారు. తాము లేవనెత్తిన కొన్ని అంశాలపై మంత్రి స్పందించలే దన్నారు. ఐపీసీ స్థానంలో తీసుకొ చ్చిన కొత్త న్యాయచట్టాలపై కర్ణా టక, పశ్చిమబెంగాల్, తమిళనాడు (Rana Taka, West Bengal, Tamil Nadu) రాష్ట్రాలు కొన్ని సవరణలు తీసు కొచ్చాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సవరణ లు తీసుకురావడం లేదన్నారు. కేం ద్రం తెచ్చిన చట్టాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాల న్నారు. సవరణలు చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఆ బిల్లు తీసుకొస్తా రో సభకు తెలియజేయాలని కేటీఆ ర్ కోరారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, చర్యలకు వ్యతిరే కంగా నిరహరదీక్షలు చేయడం కూ డా కొత్త చట్టాల ప్రకారం నేరమని, అలాంటి చట్టాల్లో సవరణలు తీసు కురావాల్సిన అవసరం ఉందన్నా రు.
తెలంగాణలో పోలీసుల వైఖరిని (Attitude of the police) కేటీఆర్ తప్పుబట్టారు. వివిధ ప్రతి పక్ష పార్టీలు, ప్రజాసంఘాలపై అన ధికార ఒత్తిడి, బలప్రయోగం సరికా దన్నారు. చట్టాలను ప్రభుత్వం దు ర్వినియోగం చేయడం సరికాద న్నా రు. ఇటీవల పౌరహక్కుల సంఘం నాయకులు హైదరాబాద్‌లోని ఓ హాలులో సమావేశం పెట్టుకోవడాని కి అనుమతి ఇవ్వలేదని ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం మరింత జాగ్ర త్తగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ హాల్‌లో ఫో టోలు, వీడియోలు తీయడంపై కేటీ ఆర్ స్పందిస్తూ పార్లమెంట్‌లో గతం లో కాంగ్రెస్ ఎంపీలు ఫోటోలు, వీడి యోలు తీసిఉండొచ్చన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. పార్లమెంట్, అసెం బ్లీలో ఫోటోలు, వీడియోలు తీయ డం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడితే స్పీకర్‌కు చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు. తాను మాట్లాడేటప్పుడు మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరైనా ఫోటోలు, మార్ఫింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అధికారపక్షం మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్..
కేటీఆర్ (ktr) వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) స్పందించారు. రెం డు రోజుల క్రితం అసెంబ్లీ హాల్‌లో తీసిన వీడియో పంపిస్తానని.. ఆది సహేతుకమైన చర్య కాదన్నారు. అలా వీడియో మార్ఫింగ్ చేసి ప్ర చారం చేయడం దుర్మార్గపు చర్య గా, దుశ్చర్యగా స్పీకర్ పేర్కొన్నారు. సభకు సంబంధించిన అంశాలను ఇలా మార్ఫింగ్ చేయడం సరికాద న్నారు. ఆ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వీడి యో చూసిన తర్వాత మీరు మాట్లా డాలంటూ కేటీఆర్‌కు స్పీకర్ సూచిం చారు.