Komatireddy venkat reddy: ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ భూస్థాపితం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాఫ్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
మేడిగడ్డ తరహాలోనే బిఆర్ఎస్ పార్టీ కూలిపోవడం ఖాయం
కవితతో దేశంలో ఇప్పటికే తెలం గాణ పరువు పోయింది
మిష్టర్ కేటిఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
మరోసారి మా సీఎంను తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working president KTR) కేటీఆర్‌పై రాఫ్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మిస్టర్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. మరోసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు. గురు వారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్(KTR) బచ్చా అంటూ తండ్రి పేరు చెప్పు కుని నువ్వు మంత్రి అయ్యావని, మా రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్ అయ్యారని పేర్కొ న్నారు.
రేవంత్ వయసులో పోలిస్తే కేటీఆర్ చిన్న పిల్లాడివని వ్యాఖ్యా నించారు. సిరిసిల్లలో కేకే మహేం దర్ రెడ్డి పొట్ట కొట్టి కేటీఆర్ ఎమ్మె ల్యే అయ్యాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) విమర్శించారు. పార్లమెంట్ ఎన్ని కల రిజల్ట్స్ తరువాత బీఆర్ ఎస్ భూస్థాపితం అవడం ఖాయం అని అన్నారు. మేడిగడ్డ మాది రిగానే బీఆర్ఎస్ పార్టీ కూలిపో వడం ఖాయం అన్నారు. కేసీఆర్ కూతురు కవిత చేసిన పనికి రాష్ట్రం పరువు పోతోందని వ్యాఖ్యానించా రు మంత్రి. 5వ తేదీ నుంచి బీఆర్ ఎస్ కార్యకర్తలే కేటీఆర్, హరీష్ రావుని కొడుతారని అన్నారు. నంది నగర్ నుండి కారులో న్యూట్రల్లో వెళ్లినా అసెంబ్లీకి చేరుకోవచ్చునని.. కట్టే పట్టుకొని అసెంబ్లీకి రాలేదు కానీ, బీజేపీ కోసం బస్సులో తిరిగా రని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించా రు మంత్రి. అసలు తెలంగాణ కోసం కొట్లాడింది తామేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) పార్టీకి రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తుందని అన్ని స్థానాల్లో ఓడిపోతుందని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 12 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లీడర్, క్యాడర్ లేకుండా పోతారని అన్నారు. 5వ తేది తర్వాత తెలం గాణ భవన్‌కి తాళం వేసుకోవాల్సి వస్తుందన్నారు. కవితకు బెయిల్ రావట్లేదని కేటీఆర్ పూర్తిగా ఫస్ట్రేషన్లోకి వెళ్లారని, అందుకే ఇష్టారీతిన తమ ప్రభుత్వంపై కారుకూతలు కూస్తున్నారంటూ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
.మా ముఖ్య మంత్రిని తిడుతావా కేటీఆర్, మహి ళలకు ఉచిత బస్సు ఇస్తున్నందుకు మా రేవంత్ ని తిడుతున్నావా, రూ. 500 లకు సిలిండర్, ఉచిత విద్యుత్ ఇవ్వడమే మేం చేస్తున్న పాపమా, హాస్టల్స్, పేదవారికి ఇచ్చే ఉచిత బియ్యం పూర్తిగా సన్నబి య్యం ఇద్దామనుకోవడం తప్పా మేం ఇచ్చిన నోటిఫికేషన్ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది అంటు న్నావ్, మరి మీరే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, మా ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ చేసి న పనికి మూడు డ్యాములు కొట్టు కొని పోయే ప్రమాదం ఉందని నిపు ణులు చెప్తున్నారు. కాళేశ్వరం పేరు తో కోట్ల రూపాయలు వృధా చేశా రు. వైన్ షాపుల పేరు మీద కేసీఆర్ నాన్ రిఫండబుల్ పైసలు గుంజిం డని, ఏకకాలంలో రుణమాఫీ చేయ బోతున్నామని, మల్లన్నపై కేసులు ఉన్నాయని అంటున్నావ్, మరి మీ చెల్లిపై 8000 పేజీల ఛార్జ్ షీట్ పై ఏమంటావ్ కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ఏం పైరవీ చేసుకొని పదవి తెచ్చుకు న్నారు, ఆయన పేరు పలకాలంటే సిగ్గుగా ఉందా అని కేటీఆర్‌పై(KTR) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఆగ్ర హం…
తెలంగాణ బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థా యిలో ఫైర్ అయ్యారు. ఈ డిపార్ట్ మెంట్‌కి వెళ్లినా మహేశ్వర్ రెడ్డి ఆర్టీఐ అప్లికేషన్లే ఉంటున్నాయని అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి పైస లు సంపాదించాలని మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఆర్టీఐలు కోరుతున్న మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గానికి ఏం కావాలని ఒక్కసారైనా అడిగారా అని మంత్రి ప్రశ్నించారు.
KTR keep his mouth under control