KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు (Supreme Court)ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr)చెప్పారు. అసెంబ్లీ మీడియా పా యింట్ వద్ద ఆయన గురువారం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయ మిదన్నారు. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ (Classification of SC)కు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు. ఈ అంశం పై మిగతా రాజకీయ పార్టీలన్ని ఓట్ల రాజకీయం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు.
ఒకే పార్టీలో వర్గీకర ణకు మద్దతుగా ఒక వర్గం వ్యతి రేకంగా ఓ వర్గం వాదనలు వినిపి స్తూ ఎస్సీలను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ మాత్రమే ఎస్సీ వర్గీకరణలో (Classification of SC)మిగతా పార్టీల మాదిరిగా ఒకే పార్టీలో మే ము రెండు వాదనలు వినిపించలే దన్నారు. ఒక్క కేసీఆర్ (kcr)మాత్ర మే ఈ అంశాన్ని రాజకీయకోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణం లో ఆలోచించారన్నారు. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యా యమైన డిమాండ్ అని కేసీఆర్ భావించారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన సంగతిని గుర్తు చేశారు.స్వయంగా సీఎం హోదా లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ లేఖ ఇచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ (Classification of SC)తన బాధ్యత అని కూడా కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని కూడా కేసీఆర్ గతంలో కోరారన్నారు. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని చెప్పారు.