–8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయి
–మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో ( Telangana)చెరి సగం ఎనిమెనిమిది ఎంపీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నాయని బిఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లో 16ఎంపీలు వచ్చిన టీడీపీ( TDP,) వైజా గ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలి గిందని గుర్తు చేస్తూ 8స్థానాలు గెలి చిన బీజేపీ కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నా యని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామ రక్ష అని చెప్పారు.ఉద్దేశ పూర్వకంగా సింగరేణికి(singareni )కోల్ బ్లాక్స్ కేటాయించడం లేదని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR)మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల యాక్షన్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. 16ఎంపీల పవర్ ఏంటో ఏపీని చూస్తే తెలుస్తుందని ఉద్ఘాటించారు. రేవంత్ ఎందుకు ఆపడం లేదు. కేసుల భయమా అని ఎద్దేవా చేశారు. అందుకే 16ఎంపీలు గెలిపించాలని ప్రజలను కోరా మన్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్(CM revanth)ఆ కత్తికి సాన పడుతున్నారని సెటైర్లు విసిరారు.సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. సింగరేణిని కార్పొరే ట్ గద్దలకు అప్పగించడాన్ని వ్యతి రేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటామన్నారు. వేలంలో పాల్గొనే వారు ఆలోచించా లని కోరారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా, గుజరాత్‌లో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనాలని నిలదీశారు. ఇక్కడ ఉన్న ఎంపీలు చేత కానివారా అని కేటీఆర్ (KTR)ప్రశ్నించారు.