— కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలి
–లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు ప్రారంభిస్తాం
–కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం
–రేవంత్ కు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్టిమేటం
KTR:ప్రజా దీవెన, కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (kcr) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వ రం ప్రాజెక్టు (Kaleshwaram project)ఆగ స్టు 2 లోగా పంపు లు ఆన్ చేసి రైతాంగానికి నీరందిం చాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా మా రావు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) పై చేస్తున్న ఆరోప ణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృం దం, మాజీ ప్రజా ప్రజలతో కలిసి శుక్రవారం కాలేశ్వరం కన్నెపల్లి, మేడిగడ్డను సందర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ ఈ ఆగస్టు 2లోపు కన్నె పెళ్లి లక్ష్మీ పంప్ హౌస్ లోని పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీరందించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 50వే ల మంది రైతులతో కలిసి ప్రాజెక్టు(project) వద్దకు వెళ్లి మేమే పంపులు ఆన్ చేసి రైతులకు నీరందేలా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం రైతులకు నినందించకుండా రైతులపై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పగా ప్రతీకారం ఉంటే కేసీఆర్ తో చూసుకోవాలని, కానీ అమాయ కులైన రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. బ్రహ్మాండమైన ప్రాజెక్టు (Awesome project)నిర్మించి ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా లేని పోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు.