KTR’s birthday celebrations:ప్రజా దీవెన, కోదాడ:తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను (KTR’s birthday celebrations) మున్సిపల్ పరిధిలోని స్థానిక కోమరబండ లోని తెలంగాణ ఉద్యమకారుడు మామిడి రామారావు (Rama Rao)ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెనులు,పెన్సిల్ (Note books, pens, pencil) పంపిణీ చేసిన అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు (ktr)పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ. పాఠశాలల్లోని తరగతులలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోనిఉన్నత శిఖరాలవైపు అడుగులు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమం నడిపిన నేత కల్వకుంట్ల తారకరామారావు అని గుర్తు చేశారు.పది సంవత్సరాల పాలనలో మంత్రిగా తన శైలిలో పాలన చేశారని గుర్తుచేశారు.తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఐటీ రంగం (it deparment)అభివృద్ధి కావడానికి కేటీఆర్ కృషి ఎంతో ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటేశ్వర్లు, చాటు మురళి,షేక్ నాగులు, వీరబాబు, సీతయ్య,బొల్లం ఉపేందర్,రాయపూడి గోపయ్య వెంకటయ్య,అఖిల్,కార్తిక్,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.