మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 29. నాంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ లక్ష్మి రామకోటి గీత భక్తుడు జంపాల నరసింహ అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకొని శనివారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి కుటుంబాన్ని సందర్శించి నరసింహ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబాన్ని నేను ఎల్లవేళలా ఆదుకుంటానని ఆర్థిక సహాయం అందించారు.
నరసింహ పట్టణ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండే వారిని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజి వార్డ్ మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండెబోయిన సత్తయ్య పంగ కొండయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ నాంపల్లి హనుమంతు నాయకులు గాదేపాక రమేష్. నాంపల్లి బిక్షం కప్పెర లక్ష్మయ్య బచ్చన బోయిన బిక్షం జంపాల బిక్షం అనిత తదితరులు పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు