మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 19. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో పట్టణ వ్యాపారవేత్త గౌరు లలితయ్య కవిత కుమారుడు గౌరు ప్రశాంత్ బుధవారం రోజున అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో మండలములోని అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు మండల గురు స్వామి తల్లోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఆటపాటలతో స్వామి 18 మెట్ల పూజతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు.
అనంతరం భక్తులను స్వాములను ఉద్దేశించి మాట్లాడుతూ స్వామి మాల ధారణతో జీవన ప్రమాణాలు క్రమశిక్షణ కలుగుతుందని ఉపవాస దీక్షలు ఆరోగ్యానికి మంచిదని అన్నారు స్వాములకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు అందుకు స్వాములు ఆనందంతో కృష్ణారెడ్డికి తీర్థప్రసాదాలు అందించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాంపల్లి పట్టణ వ్యాపారవేత్తలు సంగెపు పరంధాములు భారతమ్మ ఆలంపల్లి ఆనంద్ వీరమల్ల లవయ్య, మండల ఉత్తమ రైతులు పెద్దిరెడ్డి మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి శాలివాహన సంఘం జిల్లా నాయకులు తిరుమనీ శేఖర్ శ్రీ శ్రీ భక్త మార్కండేయ దేవాలయం కమిటీ మెంబర్ కర్నాటి విజయ్ కుమార్. అయ్యప్ప స్వాములు నాంపల్లి శ్రీను కర్నాటి మహాత్మా, పూల యాదగిరి నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్ పట్టణ మాజీ వార్డ్ మెంబర్లు గుండెబోయిన సత్తయ్య పంగా కొండయ్య పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు