నేడు రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణోత్సవం
13 న గురువారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి రథోత్సవం
సొంత ఖర్చులతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
అభినందనలు తెలుపుతున్న నాంపల్లి మండల ప్రజలు
Kumbham Krishna Reddy : ప్రజా దీవెన నాంపల్లి : ఫిబ్రవరి 10 మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలోని ఉన్న శ్రీ రాధా రుక్మిణి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి శుక్రవారం వరకు ఘనంగా మండల ప్రజలు జరుపుకోవాలని నేడు రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణం జరుపబడును ఈనెల 13న గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది నాంపల్లి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వేలాదిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుంది ఇంగ్లీష్ సంవత్సరం ప్రారంభంతో రెండవ నెల ఫిబ్రవరి కావడం పూజా కార్యాలకు వివాహాలకు గృహప్రవేశాలకు ముందుగా ముహూర్తాలు ఫిబ్రవరిలోని దాదాపు ప్రారంభిస్తారు అలాగే శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలను తిలకించి శుభకార్యాలను ప్రారంభించడం మండల ప్రజలకు ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుతుంది ఈ బ్రహ్మోత్సవాలకు మండల ప్రజలు కుల మత పార్టీలకతీతంగా హాజరై బంధువులతో బాగోగులు తెలుసుకోవడం చాలా ముచ్చటగా ఉంటుంది స్వామివారి బ్రహ్మోత్సవాలను నాంపల్లి పట్టణానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి గ థ కొన్ని సంవత్సరాలుగా సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తున్నారు మండల ప్రజలు కుంభం కృష్ణారెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు .
ఆయన ఆదివారం రోజున పట్టణ కేంద్రంలోని దేవాలయాలను దర్శించారు ఏర్పాట్లను పరిశీలనలో భాగంగా నాంపల్లిలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామాలయాన్ని దర్శించి నిర్మాణ పనులను పరిశీలించి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవాలయ కమిటీకి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కండేయ దేవాలయం కమిటీ చైర్మన్ కోట రఘునందన్ నాంపల్లి పట్టణ మాజీ వార్డ్ మెంబర్లు వంగ కొండయ్య పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ నాంపల్లి హనుమంతు వ్యాపారవేత్త ఆలంపల్లి ఆనంద్ కుమార్ నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పానుగంటి వెంకటయ్య గౌడ్ నాయకులు బుంగ రమేష్ నెంబర్ రాములు పన్నాల మల్లయ్య కోరి నగేష్ కామిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు