Kvps hostels : పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి
--కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి
–కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రోజు రోజుకూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 2500 కు పెంచాలని, ప్యాకేట్ మనీ 1500 రూపాయలు ఇవ్వాలని కుల వి వక్ష వ్యతిరేక పోరాట సంఘం (kvps) జిల్లా ప్రధాన కార్యదర్శి పా లడుగు నాగర్జున డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షే మ హాస్టల్స్ ( welfare hostels) సమస్యలపైన అధ్యయన యాత్ర లు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఎస్సి( sc ) బాలిక ఏ, బి హాస్టల్లో కెవిపిఎస్ ఆధ్వ ర్యంలో సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగ పాలడుగు నాగార్జు న మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ ( hostels) విద్యార్థులకు పెరుగు తున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, పెండింగ్ లో ఉన్న ప్యాకెట్ మనీ డబ్బులు వెంటనే ఇ వ్వాలని, ప్రస్తుతం ఉన్న మెనూను సక్రమంగా అమలు చేసి విద్యా ర్థులకు సరైన పోషకాహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దోమల నివారణకు దోమ తెరలు, కిటికీలకు జాలీలు లేక పోవడంతో దోమలు విపరీతంగా కుడుతున్నా యని విద్యార్దులు సర్వేలో వాపో యారు. అన్నిమెటీరి యల్స్ ను, ఆట వస్తువులను వెంటనే ప్రభు త్వం అందించాలన్నారు. హాస్టల్లో ఉదయం పూట పెట్టా ల్సిన టిఫిన్ ప్రతిరోజు రైస్ ( rice) ,కిచిడీ మాత్రమే పెడుతున్నారని, కనీసం ఇడ్లీ, పూరి,వడ వంటి టిఫిన్లకు విద్యార్థులు నోచుకోవట్లేదని విమ ర్శించారు.
విద్యార్థులకు సన్న బియ్యం వండటం లేదని, నాసిరకమైన బియ్యం తో ముద్దగా మారుతుందన్నారు. విద్యార్థు లకు నాణ్యమైన భోజనం లేకపోవ డంతో చదువులపై దాని ప్రభావం పడుతుందన్నారు. సంవ త్సరాల కొద్దీ ఇన్వర్టర్లు ( invorters) కరాబ్ అయితే రిపేరు చే యించే పరిస్థితి లేదని ఎంతటి వివక్ష విడనాడాలని కోరారు. జిల్లా కలెక్టర్ ( disrict collector) ఇన్వర్టర్ లపై శ్రద్ధ పెట్టి వెంటనే బాగు చేయించాలన్నారు. హాస్టల్ సమస్యలన్నీటిని తక్షణమే పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం సాంఘిక సంక్షేమ హాస్టల్ వి ద్యార్థులకు మెస్ చార్జీ ల పెంపుదల కు తక్షణమే బడ్జెట్ కేటాయించాల న్నారు. హాస్టల్ కు ప్రభుత్వ వైద్యాధి కారులు నెలకోసారి సందర్శించి విద్యా ర్థుల ఆరో గ్య సమస్యల్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ సమస్యల సాధనకై జిల్లావ్యాప్తంగా సర్వేలు చేసి భవిష్యత్ కార్యాచరణ, దశల వారిగా పోరాటాలను నిర్వహించ ను న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్య దర్శి గాదె నరసింహ ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్ తోపాటు విద్యార్థి ని విద్యార్థులు పాల్గొన్నారు.
Kvps hostels